నేపాల్‌లో ఇక రూ.200, రూ.500 నోట్లు..

Published on Mon, 07/27/2026 - 11:29

భారత్–నేపాల్ మధ్య ప్రయాణాలు, సరిహద్దు వాణిజ్యానికి ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని నేపాల్ ప్రభుత్వం అమలు చేసింది. 2016లో భారత్‌లో నోట్ల రద్దు తర్వాత అమల్లోకి వచ్చిన కఠిన పరిమితులను సడలిస్తూ, 2016 నవంబర్ 9 తర్వాత జారీ చేసిన భారతీయ రూ.200, రూ.500 నోట్లను ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా రూ.25,000 వరకు నేపాల్‌లోకి తీసుకెళ్లడానికి, అక్కడి నుంచి తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (Nepal Rastra Bank–NRB) తాజాగా మరోసారి స్పష్టీకరణ నోటీసు విడుదల చేసింది.

ఫిబ్రవరి 11న నేపాల్ గెజిట్‌లో ఈ నిబంధనలు ఇప్పటికే ప్రచురించినప్పటికీ, వాటి అమలుపై స్పష్టత కల్పించేందుకు ఎన్‌ఆర్‌బీ తాజా నోటీసు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. భారతీయులు, నేపాలీయులు ఇద్దరూ 2016 నవంబర్ 9 తర్వాత ముద్రించిన రూ.200, రూ.500 నోట్లను చట్టబద్ధంగా వినియోగించవచ్చు. అయితే 2016కు ముందు జారీ చేసిన పాత రూ.500, రూ.1,000 నోట్లు మాత్రం నేపాల్‌లో ఇప్పటికీ నిషేధితంగానే ఉంటాయి.

ఎన్‌ఆర్‌బీ అధికార ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ ప్రకారం.. నేపాలీ పౌరులు భారత కరెన్సీని భారత్ నుంచి మాత్రమే నేపాల్‌కు తీసుకురావాలి. అలాగే నేపాల్ నుంచి భారతదేశం మినహా మూడో దేశానికి భారత కరెన్సీని తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదు. ఈ నిబంధనలు సరిహద్దు నగరాల ప్రజలు, వ్యాపారులు, పర్యాటకులకు వర్తిస్తాయి. 

విదేశీ కరెన్సీ విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల్లో మార్పు లేదు. నేపాలీ పౌరులు, విదేశీ సందర్శకులు 5,000 అమెరికన్ డాలర్లు లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీని కస్టమ్స్ డిక్లరేషన్ లేకుండా తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా కస్టమ్స్‌కు ప్రకటించాల్సి ఉంటుంది.

2016లో భారత ప్రభుత్వం రూ.500, రూ.1,000 పాత నోట్లను రద్దు చేసిన అనంతరం, నేపాల్ భద్రతా, ఆర్థిక కారణాలతో రూ.100కు మించిన భారతీయ నోట్ల ప్రవేశాన్ని నిలిపివేసింది. దాంతో భారత పర్యాటకులు, సరిహద్దు వ్యాపారులు, నేపాల్‌లో పనిచేసే వేలాది మంది నేపాలీయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజా నిర్ణయంతో దాదాపు పదేళ్ల తర్వాత ఆ పరిమితులకు గణనీయమైన సడలింపు లభించినట్లైంది. భారత్–నేపాల్ మధ్య పర్యాటకం, చిన్న స్థాయి సరిహద్దు వాణిజ్యం, ప్రజల మధ్య ఆర్థిక లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇది చదివారా? ప్లాస్టిక్ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఆర్బీఐ తొలి అడుగు! 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)