Breaking News

నీతూ కపూర్ కారు ధర అన్ని కోట్లా!

Published on Mon, 03/06/2023 - 16:48

గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది.

నీతూ కపూర్ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన Maybach GLS600. దీని ధర సుమారు రూ. 3 కోట్లు. ఈ కొత్త లగ్జరీ కారు కొనుగోలుతో ఈమె మేబ్యాచ్ కారుని కలిగి ఉన్న ఓనర్ల జాబితాలో చేరిపోయింది. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా భారతదేశానికి దిగుమతవుతుంది. కావున ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ సెలెనైట్ సిల్వర్, బ్రిలియంట్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, కావాన్‌సైట్ బ్లూ, ఇరిడియం సిల్వర్, పోలార్ వైట్ వంటి మల్టిపుల్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ధర కొంత ఎక్కువైనప్పటికీ ఈ కారు ఆధునిక డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ జిఎల్‌ఎస్600 ఎస్‌యూవీలోని 4.0 లీటర్ వి8 ఇంజన్‌ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి పవర్, 249 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది.

(ఇదీ చదవండి: మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్‌జి మోటార్: సేల్స్‌లో టాటా స్థానం ఎంతంటే?)

మేబ్యాచ్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. కావున ప్రయాణికుల భద్రతకు ఏ డోకా ఉండదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)