Breaking News

'స్పెక్ట్రం అవసరం మరింత పెరుగుతుంది': టెలికం కార్యదర్శి

Published on Sun, 03/02/2025 - 09:01

న్యూఢిల్లీ: దేశీయంగా డేటా వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో టెలికం సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి 'నీరజ్‌ మిట్టల్‌' తెలిపారు. మొబైల్, బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగానికి మరింత స్పెక్ట్రం అవసరమవుతుందని తెలిపారు. అటు 5జీ సేవల కోసం చేసిన ఇన్వెస్ట్‌మెంట్లపై టెల్కోలకు రాబడులు లభించడం కష్టతరంగా ఉంటున్న నేపథ్యంలో.. ఈ రెండు అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు వివరించారు.

దేశీయంగా డేటా స్పీడ్‌ సగటున 99–100 ఎంబీపీఎస్‌ నుంచి 151 ఎంబీపీఎస్‌కి పెరిగినట్లు చెప్పారు. సగటున ప్రతి నెలా ఒక్కో యూజరు దాదాపు 29 గిగాబైట్ల డేటాను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో 5జీ నుంచి 6జీకి మారాలంటే మౌలిక సదుపాయాలపై భారీగా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుందని, మరింత స్పెక్ట్రం అవసరమవుతుందని చెప్పారు.

ప్రైవేట్‌ టెల్కోలు 5జీ సేవల కోసం 2024లో టెలికం మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రంపై రూ. 70,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. ప్రస్తుతం జియో, భారతి ఎయిర్‌టెల్‌ 5జీ సర్వీసులను అందిస్తుండగా.. వొడాఫోన్‌ ఐడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంకా సేవలను ప్రారంభించాల్సి ఉంది. భారీగా డేటాను వినియోగించే యూజర్లున్నందున నెట్‌ఫ్లిక్స్, మెటా, అమెజాన్, గూగుల్‌లాంటి టెక్‌ దిగ్గజాలు కూడా తమ ఆదాయాల్లో కొంత భాగాన్ని భారత్‌లో నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాల కల్పన కోసం అందించాలంటూ టెల్కోలు కోరుతున్నాయి.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)