Breaking News

ఇంకా సగం మంది ఇంటర్నెట్‌కు దూరమే!

Published on Mon, 10/20/2025 - 09:42

దేశీయంగా 47 శాతం మంది ప్రజలు ఇంకా ఇంటర్నెట్‌కి దూరంగా, ఆఫ్‌లైన్‌లోనే ఉన్నారని గ్లోబల్‌ టెలికం పరిశ్రమ జీఎస్‌ఎంఏ ఓ నివేదికలో తెలిపింది. మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగంలో పురుషులతో పోలిస్తే మహిళలు 33 శాతం తక్కువగా ఉంటున్నారని వివరించింది.

హ్యాండ్‌సెట్స్‌ ధర అధికంగా ఉండటం, సాంకేతిక నైపుణ్యాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు కనెక్టివిటీ మధ్య అంతరాలకు కారణమని ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2025లో పాల్గొన్న సందర్భంగా జీఎస్‌ఎంఏ ఆసియా పసిఫిక్‌ హెడ్‌ జులియన్‌ గోర్మన్‌ తెలిపారు. దీన్ని సత్వరం పరిష్కరించకపోతే సమ్మిళిత వృద్ధికి అవరోధంగా నిల్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

దశాబ్దం క్రితం 108 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారత డిజిటల్‌ ఎకానమీ 2023లో మూడు రెట్లు పెరిగి 370 బిలియన్‌ డాలర్లకు చేరిందని, 2030 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయని నివేదిక వివరించింది. అయితే, కీలకమైన ఆవిష్కరణలు, వినియోగం మధ్య అంతరాలను పూడ్చకపోతే ఈ వేగం గతి తప్పే అవకాశం ఉందని, పేర్కొంది.

డిజిటల్‌ పబ్లిక్‌ మౌలిక సదుపాయాలు, మొబైల్‌ వినియోగాల్లో భారత్‌ అగ్రగామిగా ఉన్నప్పటికీ, పరిశోధనలు..అభివృద్ధి కార్యకలాపాలపై పెట్టుబడులు పెట్టడం, ప్రైవేట్‌ రంగంలో ఆవిష్కరణలు, సుశిక్షితులైన నిపుణులను అట్టే పెట్టుకోవడం వంటి విషయాల్లో వెనుకబడి ఉందని నివేదిక తెలిపింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)