Breaking News

రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు

Published on Tue, 10/15/2024 - 08:35

రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు గాను సిస్కా ఎల్‌ఈడీ లైట్స్‌పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రూ.7.70 కోట్ల బాకీల వసూలు కోసం రుణదాత సన్‌స్టార్‌ ఇండస్ట్రీస్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది.

సిస్కా ఎల్‌ఈడీ లైట్స్‌ బోర్డును రద్దు చేసి దివాలా పరిష్కార ప్రొఫెషనల్‌గా దేవాశీష్‌ నందాను ఎన్‌సీఎల్‌టీ నియమించింది. సన్‌స్టార్‌ సరఫరా చేసిన ఉత్పత్తుల నాణ్యతపై వివాదం నెలకొందని, ఆ కంపెనీ దివాలా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్న సిస్కా వాదనలను తోసిపుచ్చింది. సన్‌స్టార్‌కి సిస్కా రుణం చెల్లించాల్సి ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి: అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలన

ఎస్‌ఎస్‌కే గ్రూప్‌లో భాగంగా ఉన్న సిస్కా ఎల్‌ఈడీ లైట్స్‌కి ఎలక్ట్రికల్‌ గృహోపకరణాల సంస్థ సన్‌స్టార్‌ ఇండస్ట్రీస్‌ 60 రోజుల క్రెడిట్‌ వ్యవధితో ఉత్పత్తులను సరఫరా చేసేది. తొలినాళ్లలో సక్రమంగానే చెల్లింపులు జరిపినప్పటికీ 2023 మార్చి నుంచి జులై వరకు పంపిన 25 ఇన్‌వాయిస్‌లను చెల్లించకుండా డిఫాల్ట్‌ కావడంతో సన్‌స్టార్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది.
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)