Breaking News

జలన్‌ కల్రాక్‌ చేతికి జెట్‌ ఎయిర్‌వేస్‌ 

Published on Wed, 03/13/2024 - 04:28

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో మూతపడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణపరిష్కార ప్రణాళికను దివాలా పరిష్కార అపీలేట్‌ ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌ఏటీ) తాజాగా అనుమతించింది. జలన్‌ కల్రాక్‌ కన్సార్షియంకు కంపెనీ యాజమాన్యాన్ని బదిలీ చేసేందుకు ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. బదిలీని 90 రోజుల్లోగా పూర్తిచేయవలసిందిగా జెట్‌ ఎయిర్‌వేస్‌ పర్యవేక్షణ కమిటీకి సూచించింది. దీంతోపాటు పెర్ఫార్మెన్స్‌ బ్యాంక్‌ గ్యారంటీగా జలన్‌ కల్రాక్‌ కన్సార్షియం(జేకేసీ) చెల్లించిన రూ. 150 కోట్లను సర్దుబాటు చేయమంటూ జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణదాతలను ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్‌ ఆదేశించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకి గతంలో విజయవంతమైన బిడ్డర్‌గా జేకేసీ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణదాతలు, జేకేసీ మధ్య యాజమాన్య బదిలీపై తలెత్తిన న్యాయ వివాదాలు ఏడాదికాలంగా కొనసాగుతున్నాయి. 

ఇంతక్రితం కంపెనీ రుణదాతలు ఈ అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ జోక్యం చేసుకునేందుకు తిరస్కరించింది. అంతేకాకుండా నిర్ణయాధికారాన్ని ఎన్‌సీఎల్‌ఏటీకి అప్పగించింది. ఆర్థిక సవాళ్లతో జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్విసులు 2019 ఏప్రిల్‌ నుంచి నిలిచిపోగా.. 2021లో జేకేసీ విజయవంత బిడ్డర్‌గా నిలిచింది. కాగా.. కోర్టు అనుమతించిన రుణ పరిష్కార ప్రణాళిక(రూ. 350 కోట్ల ఆర్థిక మద్దతు)లో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు గతేడాది జలన్‌ కల్రాక్‌ కన్సార్షియం రూ. 100 కోట్ల పెట్టుబడులను సమకూర్చింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది(2024)లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ యోచిస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)