Breaking News

మైక్రోసాఫ్ట్‌ సర్వీసుల నిలిపివేత

Published on Tue, 07/29/2025 - 10:30

రష్యన్‌ కంపెనీలపై యూరోపియన్‌ యూనియన్‌ ఆంక్షల నేపథ్యంలో నయారా ఎనర్జీకి టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సేవలు నిలిపివేసింది. దీనితో గతంలోనే పుర్తిగా చెల్లించి, లైసెన్సులను కొనుగోలు చేసినప్పటికీ సొంత డేటా, ఇతరత్రా టూల్స్‌ మొదలైనవి తమకు అందుబాటులోకి లేకుండా పోయాయని నయారా వెల్లడించింది. ఇలాంటివి చాలా ప్రమాదకర ధోరణులని ఆందోళన వ్యక్తం చేసింది.

మైక్రోసాఫ్ట్‌ ఏకపక్షంగా, హఠాత్తుగా సర్వీసులను నిలిపివేయడంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించింది. సర్వీసులను పునరుద్ధరించేలా ఆదేశించాలని కోరుతూ పిటీషన్‌ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాను కట్టడి చేసే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నయారా ఎనర్జీపై కూడా యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఆంక్షలు విధించింది. 

ఇదీ చదవండి: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!

అయితే, ఇవి ఈయూ చట్టాల పరిధిలోకే వస్తాయి తప్ప మైక్రోసాఫ్ట్‌లాంటి అమెరికన్‌ కంపెనీలకు, భారతీయ సంస్థలకు వర్తించవని నయారా ఎనర్జీ తెలిపింది. రిఫైనింగ్‌ సామర్థ్యంలో 8 శాతం, రిటైల్‌ పెట్రోల్‌ బంకుల నెట్‌వర్క్‌లో ఏడు శాతం వాటాతో భారత ఇంధన భద్రతలో తమ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని వివరించింది.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)