Breaking News

ఆడ్‌కాక్‌ వాటాలపై నాట్కో కన్ను

Published on Thu, 07/24/2025 - 09:39

దక్షిణాఫ్రికాకు చెందిన ఔషధ సంస్థ ఆడ్‌కాక్‌ ఇన్‌గ్రాం హోల్డింగ్స్‌లో మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కొనుగోలు చేయనున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది.  ఇందుకోసం నగదు డీల్‌ రూపంలో రూ. 2,100 కోట్ల వరకు ఆఫర్‌ చేసినట్లు తెలిపింది. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఆడ్‌కాక్‌లో నాట్కోకు గతంలో ఉన్న 0.80 శాతంతో కలిపి మొత్తం 35.75 శాతం వాటా (సుమారు 5,16,43,319 షేర్లు) దక్కుతుంది. దీని విలువ 226 మిలియన్‌ డాలర్లు. ప్రస్తుతం ఆడ్‌కాక్‌ వేల్యుయేషన్‌ సుమారు 632 మి. డాలర్లుగా ఉంది.

ఇదీ చదవండి: డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.1,410 కోట్లు

డీల్‌ తర్వాత కంపెనీలో బిడ్‌వెస్ట్‌ (64.25%), నాట్కో  (35.75%) ప్రధాన వాటాదార్లుగా ఉంటాయి. 1890లో ఏర్పాటైన ఆడ్‌కాక్‌ ఇన్‌గ్రాం ప్రధానంగా ప్రిస్క్రిప్షన్, ఓటీసీ తదితర 4 సెగ్మెంట్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 536 మిలియన్‌ డాలర్ల ఆదాయం, 33.4% స్థూల మార్జిన్‌ నమోదు చేసింది. దక్షిణాఫ్రికా మార్కెట్లో విస్తరించేందుకు, కొత్త ఆదాయ మార్గాలను అందిపుచ్చుకునేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని నాట్కో ఫార్మా సీఈవో రాజీవ్‌ నన్నపనేని తెలిపారు. కంపెనీకి గల సుదీర్ఘ చరిత్ర, బ్రాండ్స్‌పై గల నమ్మకానికి ఈ ఒప్పందం నిదర్శనంగా నిలుస్తుందని ఆడ్‌కాక్‌ సీఈవో ఆండ్రూ హాల్‌ తెలిపారు. ఈ డీల్‌ నాలుగు నెలల్లో ముగియవచ్చని అంచనా. 

#

Tags : 1

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)