Breaking News

మోదీ కేబినెట్ తొలి నిర్ణయం: పేద ప్రజలకు శుభవార్త

Published on Mon, 06/10/2024 - 21:06

నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు (జూన్ 10) మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో కొత్త మంత్రుల శాఖలను కూడా ప్రకటించారు. ఈ తరుణంలోనే పట్టణ, గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సొంతింటి కలను నిజం చేయడానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

నరేంద్ర మోదీ.. ఇతర కేంద్ర మంత్రుల మంత్రివర్గ సమావేశంలో పీఎం ఆవాస్ యోజన కింద ఏకంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దేశంలో సొంతింటి కలను నిజం చేసుకునే వారికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఓ గొప్ప వరం అనే చెప్పాలి.

పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయాలనే సదుద్దేశ్యంతో.. 2015-16 బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రకటించారు. అర్హత కలిగిన పేద ప్రజలు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది. గడిచిన 10 సంవత్సరాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 4.21 కోట్ల ఇల్లు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరుగుదొడ్లు, ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్, విద్యుత్తు కనెక్షన్, కుళాయి (నల్లా) కనెక్షన్ వంటివి కూడా ఉన్నాయి. ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలు చేయడం జరిగింది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)