Breaking News

తయారీ కేంద్రంగా భారత్!.. చెప్పడం సాహసమే

Published on Mon, 07/29/2024 - 14:56

వారానికి 72 గంటల పని గురించి చెబుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చైనాను భారత్ అధిగమిస్తుందని పలువురు నిపుణులు చెబుతుంటే.. తయారీ రంగంలో ఇండియా చైనాని దాటాలంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాలని 'ఈఎల్‌సీఐఏ టెక్ సమ్మిట్ 2024'లో పేర్కొన్నారు.

ఇండియా సామర్థ్యం మీద సందేహంగా ఉంది. ఇప్పటికే చైనా ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్ మార్కెట్లు, హోమ్ డిపోలలోని దాదాపు 90 శాతం వస్తువులు చైనాలో తయారైనవే ఉన్నాయి. అవన్నీ భారత్ జీడీపీకి ఆరు రెట్లు. కాబట్టి ఈ సమయంలో మన దేశం చైనాను అధిగమిస్తుందని చెప్పడం సాహసమనే చెప్పాలి అని నారాయణ మూర్తి అన్నారు.

ఐటీ రంగ ఎగుమతుల్లో భారత్ వృద్ధి సాధిస్తుండగా.. తయారీ రంగం మాత్రం దేశీయ సహకారం, ప్రభుత్వ మద్దతు వంటి వాటి మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ లక్ష్యాలను చేరుకోవాలంటే.. ప్రభుత్వాల పాత్ర చాలా కీలకమని నారాయణ మూర్తి అన్నారు. ఇది మెరుగుపడాలంటే ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమాచారం లోపాలను తగ్గించాలని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తలు మార్కెట్ పరిస్థితులను మెరుగ్గా అంచనా వేయాలి, అప్పుడే తయారీ రంగం అభివృద్ధి చెందుతుంది అని ఆయన అన్నారు.

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)