Breaking News

డ్రోన్‌ కొనుగోలుకు రూ.8 లక్షలు సాయం

Published on Sat, 11/02/2024 - 13:21

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేలా కేంద్రం ప్రవేశపెట్టిన ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకంలో నమోదు చేసుకున్న ఒక్కో సంఘానికి రూ.8 లక్షలు మేర సాయం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకంలో భాగంగా సుమారు 14,500 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.

వ్యవసాయం ఎంతో శ్రమతో కూడుకున్నది. టెక్నాలజీ సహాయంతో వ్యవసాయాన్ని సులువుగా చేసేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో స్థానిక మహిళా స్వయం సహాయక సంఘాలను భాగం చేస్తోంది. వారికి డ్రోన్లు అందించి సరైన శిక్షణ ఇవ్వడంతో ఉపాధి కల్పిస్తోంది. అదే సమయంలో రైతులపై పనిభారం తగ్గినట్లవుతుందని కేంద్రం భావిస్తోంది.  అందుకోసం ‘నమో డ్రోన్‌ దీదీ’ పథకాన్ని గతంలోనే ప్రారంభించింది.

ఇదీ చదవండి: 171.6 టన్నుల బంగారు ఆభరణాలు!

ఈ పథకానికి సంబంధించి కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులోని అంశాలను అమలు చేసేందుకు రూ.1,261 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. డ్రోన్‌ కొనుగోలులో 80 శాతం వరకు కేంద్రమే భరించనున్నట్లు చెప్పింది. లేదంటే రూ.8 లక్షలు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ ధరతో డ్రోన్‌ కొనుగోలు చేయాలనుకునే స్వయం సహాయక సంఘాలకు అదనంగా అవసరమయ్యే డబ్బును నేషనల్‌ అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌ ఫెసిలిటీ కింద 3 శాతం వడ్డీరాయితీతో అందించనున్నట్లు పేర్కొంది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)