Breaking News

ఈక్విటీల్లో ఫండ్స్‌ పెట్టుబడులు రూ.2,400 కోట్లు

Published on Mon, 06/12/2023 - 04:38

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు మే నెలలో ఈక్విటీల్లో కొనుగోళ్ల బాట పట్టాయి. ఏప్రిల్‌ నెలలో నికరంగా రూ.4,553 కోట్లను ఈక్విటీల నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) వెనక్కి తీసుకోగా, మే నెలలో రూ.2,446 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడం, జీడీపీ వృద్ధి బలంగా ఉండడం ఇందుకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు చెబుతున్నారు. మే నెలలో ఈక్విటీ పెట్టుబడుల విషయంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల మధ్య చాలా అంతరం నెలకొంది.

ఎఫ్‌పీఐలు ఏకంగా రూ.43,838 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా, మ్యూచువల్‌ ఫండ్స్‌ రూ.2,446 కోట్ల పెట్టుబడులకే పరిమితమైనట్టు సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్‌లోనూ ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీల్లో రూ.11,631 కోట్లను ఇన్వెస్ట్‌ చేశారు. ఈ తాత్కాలిక మార్పు ఈక్విటీలకు మద్దతుగా నిలిచినట్టు నిపుణులు భావిస్తున్నారు. ‘‘స్థిరమైన జీడీపీ వృద్ధి, తక్కువ ద్రవ్యోల్బణం, ఇన్వెస్టర్‌కు అనుకూలమైన విధానాలు మ్యూచువల్‌ ఫండ్స్, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు తోడ్పడ్డాయి.

ఎఫ్‌పీఐలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఒకరికొకరు సమతుల్యంగా వ్యవహరించారు. ఎఫ్‌పీఐలు విక్రయించినప్పుడు దేశీ ఇనిస్టిట్యూషన్స్‌  (మ్యూచువల్‌ ఫండ్స్‌ సహా) కొనుగోళ్లకు ముందుకు వచ్చాయి’’అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏఎంసీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అఖిల్‌ చతుర్వేది తెలిపారు.  ఎఫ్‌పీఐలు, దేశీ ఇనిస్టిట్యూషన్స్‌ మధ్య వైరుధ్యం ఉన్నప్పటికీ గడిచిన 11 నెలలుగా మార్కెట్లు మొత్తం మీద సానుకూలంగా ట్రేడ్‌ అవుతుండడం గమనార్హం. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధి మందగమనంపై ఆందోళనలు నెలకొనగా, దీర్ఘకాలంలో భారత్‌కు మెరుగైన వృద్ధి అవకాశాలు ఉన్న విషయాన్ని ఎప్సిలాన్‌ మనీ మార్ట్‌ ప్రొడక్ట్స్‌ హెడ్‌ నితిన్‌రావు గుర్తు చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)