Breaking News

విలాస నివాసాల్లో ముంబై టాప్‌

Published on Thu, 03/02/2023 - 04:43

న్యూఢిల్లీ: విలాసవంత ఇళ్ల ధరల వృద్ధిలో ముంబై స్థానం అంతర్జాతీయంగా మరింత మెరుగుపడింది. ప్రపంచవ్యాప్త జాబితాలో 92వ స్థానం నుంచి (2021లో) ఏకంగా 37కు చేరుకుంది. 2022 సంవత్సరంలో ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 6.4 శాతం పెరిగాయి. ఫలితంగా ముంబై 37వ ర్యాంక్‌కు చేరుకున్నట్టు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. అంతేకాదు ముంబై ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇళ్ల మార్కెట్‌గా 18వ స్థానంలో నిలిచింది. ‘ద వెల్త్‌ రిపోర్ట్‌ 2023’ని నైట్‌ ఫ్రాంక్‌ విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధిని ట్రాక్‌ చేసే ప్రైమ్‌ ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ ఇండెక్స్‌ (పిరి100) 2022లో 5.2 శాతమే పెరిగినట్టు నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక పేర్కొంది. ఈ సూచీ కంటే ముంబైలో విలాసవంతమైన ఇళ్ల ధరలు ఎక్కువ పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 100 పట్టణాల్లోని విలాసవంతమైన ఇళ్ల ధరలను ఈ నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది ముంబైలో ప్రధాన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు 3 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. బెంగళూరులో విలాసవంతమైన ఇళ్ల ధరలు గతేడాది 3 శాతం పెరగడంతో, 2022లో ప్రపంచవ్యాప్తంగా 63వ ర్యాంక్‌ దక్కించుకుంది. ఢిల్లీలో ఖరీదైన ఇళ్ల ధరలు 1.2 శాతం పెరిగాయి. ఈ జాబితాలో ఢిల్లీ 77వ స్థానంలో ఉంది. 2021లో 93వ ర్యాంకులో ఉండడం గమనించాలి.  

దుబాయి చిరునామా..
దుబాయిలో అత్యధికంగా ఖరీదైన ఇళ్ల ధరలు 20 22లో 44.2% పెరిగాయి. నైట్‌ ఫ్రాంక్‌ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల కేంద్రంగా దుబాయి నిలిచింది. ఖరీదైన ఇళ్ల ధరల వృద్ధి పరంగా రియాద్, టోక్యో, మియా మి, ప్రాగ్యూ, అల్గర్వే, బహమాస్, అథెన్స్, పోర్టో 2వ స్థానం నుంచి వరుసగా జాబితాలో ఉన్నాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)