Breaking News

ఇళ్ల ధరల జోరులో ముంబై నంబర్‌ 2

Published on Sat, 08/24/2024 - 06:11

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగదలలో ముంబై రియల్టీ మార్కెట్‌ రెండో స్థానం నిలిచింది. ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నట్టు జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన నైట్‌ఫ్రాంక్‌ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 44 ప్రముఖ నగరాల్లోని ఇళ్ల ధరల పెరుగుదల వివరాలను నైట్‌ఫ్రాంక్‌ విడుదల చేసింది. జూన్‌ త్రైమాసికంలో ఈ నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదల 2.6 శాతానికి పరిమితమైనట్టు తెలిపింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో పెరుగుదల రేటు 4.1 శాతంగా ఉండడం గమనార్హం.

 ఇళ్ల ధరల పెరుగుదలలో మనీలా మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 26 శాతం మేర వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల ధరలు 13 శాతం మేర జూన్‌ త్రైమాసికంలో పెరిగాయి. దీంతో ఏడాది క్రితం ఆరో ర్యాంక్‌లో ఉన్న ముంబై 2కు చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇళ్ల ధరలు 10.6 శాతం పెరగడంతో, ఏడాది క్రితం ఉన్న 26వ ర్యాంక్‌ నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. బెంగళూరులో ఇళ్ల ధరలు జూన్‌ క్వార్టర్‌లో వార్షికంగా 3.7 శాతం మేర పెరిగాయి. దీంతో 15వ ర్యాంక్‌ సొంతం చేసుకుంది. 

టాప్‌–10లో ఇవే..  
లాస్‌ ఏంజెలెస్‌లో 8.9 శాతం (4వ ర్యాంక్‌), మియామీలో 7.1 శాతం (5వ ర్యాంక్‌), నైరోబీలో 6.6 శాతం (ఆరో స్థానం), మ్యాడ్రిడ్‌లో 6.4 శాతం (ఏడో స్థానం), లిస్బాన్‌లో 4.7 శాతం (ఎనిమిదో స్థానం), సియోల్‌లో 4.6 శాతం (తొమ్మిదో స్థానం), శాన్‌ ఫ్రాన్సిస్కోలో 4.5 శాతం (10వ స్థానం) చొప్పున జూన్‌ త్రైమాసికంలో ఇళ్ల ధరలు పెరిగినట్టు నైట్‌ ఫ్రాంక్‌ నివేదిక వెల్లడించింది. దుబాయిలో 2020 సంవత్సరం నుంచి ఇళ్ల ధరలు 124 శాతం పెరగ్గా.. జూన్‌ క్వార్టర్‌లో 0.3% మేర తగ్గాయి. వియన్నాలో 3.2%, బ్యాంకాక్‌లో 3.9 శాతం చొప్పున ఇదే కాలంలో ఇళ్ల ధరలు తగ్గాయి.   
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)