Breaking News

కొంపముంచిన జీరో!.. రూ.9 లక్షలు మాయం

Published on Fri, 09/20/2024 - 18:54

సైబర్ మోసానికి సంబందించిన మరో కేసు తెరమీదకు వచ్చింది. ముంబైకి చెందిన 59 ఏళ్ల రైల్వే అధికారి ఏకంగా రూ. 9 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంతకీ ఇదెలా జరిగింది? ఇలాంటి సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?.. అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)లో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ (కన్‌స్ట్రక్షన్)గా పని చేస్తున్న వ్యక్తి మొబైల్ ఫోన్‌కు సెప్టెంబర్ 16న వాయిస్ మెసేజ్ వచ్చింది. అందులో జీరో ప్రెస్ చేయకుంటే మొబైల్ నెంబర్ బ్లాక్ అవుతుందని ఉండటంతో.. అతడు జీరో ప్రెస్ చేశారు.

జీరో ప్రెస్ చేయగానే వీడియో కాల్ కనెక్ట్ అయింది. అవతలి వ్యక్తి తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నారు. తనపైన (బాధితుడి మీద) మనీ ల్యాండరింగ్ కేసు నమోదైనట్లు, ఒక నకిలీ జడ్జి ద్వారా చెప్పించారు. తాము చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ. 9 లక్షలు పంపించకుంటే చర్య తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించారు.

కేసు నిజమేనేమో అని భయపడిన బాధితుడు తన ఖాతా నుంచి రూ. 9 లక్షలు బదిలీ చేశారు. ఆ తరువాత పూర్తిగా మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..

సైబర్ మోసాల భారిన పడకుండా ఉండాలంటే
టెక్నాలజీ పెరుగుతుండటంతో.. కొందరు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు గురి కాకుండా ఉండాలంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ చేసి మేము అధికారులము అని చెప్పినా.. మీకు సంబంధించిన వివరాలను అడిగినా.. నిర్థారించుకోకుండా వెల్లడించకూడదు. అనుమానాస్పదమైన కాల్స్ వచ్చినట్లయితే.. పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ అధికారులకు వెల్లడించాలి. తెలియని లేదా అనుమానాస్పద వాయిస్ మెసేజస్ లేదా టెక్స్ట్‌ మెసేజస్ వంటి వాటికి స్పందించకూడదు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)