Breaking News

బిలియనీర్ల నగరం ముంబై 

Published on Wed, 03/27/2024 - 04:12

ముంబై: బిలియనీర్ల విషయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై తాజాగా బీజింగ్‌ను అధిగమించింది. మంగళవారం విడుదలైన హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్టు ప్రకారం ముంబైలో 92 మంది అత్యంత సంపన్నులు ఉండగా బీజింగ్‌లో ఈ సంఖ్య 91గా ఉంది. ఇక చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉండగా భారత్‌లో 271 మంది ఉన్నారు. దేశీయంగా కుబేరుల మొత్తం సంపద 1 లక్ష కోట్ల డాలర్ల స్థాయిలో ఉంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ 115 బిలియన్‌ డాలర్ల సంపదతో అత్యంత సంపన్న భారతీయుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

గత ఏడాది వ్యవధిలో ఆయన సంపద మరో 40 శాతం (33 బిలియన్‌ డాలర్లు) పెరిగింది. ఇక హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో గణనీయంగా దెబ్బతిన్న గౌతమ్‌ అదానీ తిరిగి కోలుకున్నారు. ఆయన సంపద 62 శాతం వృద్ధి చెందింది. అంతర్జాతీయంగా అంబానీ పదో స్థానంలో ఉండగా, అదానీ 15వ స్థానంలో ఉన్నారు. 231 బిలియన్‌ డాలర్లతో టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ నంబర్‌ వన్‌గా ఉన్నారు.      కొత్త బిలియనీర్లయిన వారి విషయంలో చైనాను భారత్‌ అధిగమించింది. భారత్‌ నుంచి ఈ లిస్టులో 94 మంది చోటు దక్కించుకోగా, చైనా నుంచి 55 మందికి చోటు దక్కింది. గత ఏడాది వ్యవధిలో ముంబైలో 27 మంది బిలియనీర్లు కాగా, బీజింగ్‌లో ఆరుగురు మాత్రమే ఈ హోదా దక్కించుకున్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)