Breaking News

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపివేత.. కారణం..

Published on Thu, 04/24/2025 - 16:28

ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ) పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఆగస్టు 16, 2025 నుంచి సరుకు రవాణా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రన్‌వే 14/32 కోసం కొత్త ట్యాక్సీవేల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటు వల్ల​ భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్‌ సామర్థ్యం మెరుగవుతుందని అధికారులు తెలిపారు. తిరిగి తదుపరి నోటీసులు అందేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయిని చెప్పారు.

ముంబయిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సరఫరా కావాల్సిన సరుకు రవాణా నవీ ముంబై విమానాశ్రయం నుంచి జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పు ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తున్నప్పటికీ ఫార్మాస్యూటికల్స్, పాడైపోయే వస్తువులు వంటి ప్రత్యేక సరుకు రవాణా నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌ల మధ్య దూరం, ముంబయి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సరుకు రవాణా ఆలస్యం కావచ్చని కొందరు భావిస్తున్నారు.

సీఎస్ఎంఐఏకు పెరుగుతున్న ప్యాసింజర్‌, కార్గో రద్దీ ​కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ల రవాణా ఆలస్యం అవుతుంది. దాంతో మరిన్ని మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు ఈ చర్యలకు పూనుకున్నాయి. ఎయిర్‌ ట్రాఫిక్‌కు గ్లోబల్ హబ్‌గా ముంబయి స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ సదుపాయాలు ఎంతో కీలకం కానున్నాయని తెలిపాయి.

ఇదీ చదవండి: ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్‌ వెనక్కి

మౌలిక సదుపాయాల నవీకరణ ఇలా..

  • రన్ వే 14/32 కోసం కొత్త టాక్సీవేలు

  • టెర్మినల్ 1లో ఏటా రెండు కోట్ల మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు.

  • మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్ (ఎంఎంటీహెచ్)లో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు డైరెక్ట్ మెట్రో యాక్సెస్, అండర్ గ్రౌండ్ బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.

  • అత్యాధునిక ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు.

  • ఈగేట్స్, ఫాస్టాగ్ ఎనేబుల్డ్ పార్కింగ్, ఉచిత ఇంటర్ టెర్మినల్ కోచ్ ట్రాన్స్‌ఫర్‌ సర్వీసులను అందించేలా చర్యలు చేపడుతున్నారు.

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)