Breaking News

కాబోయే కోడ‌లి కోసం ఖ‌రీదైన కానుక‌లు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు..

Published on Fri, 02/23/2024 - 14:19

భారతదేశంలో అత్యంత ధనవంతులైన అంబానీ కుటుంబంలో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ఈ తరుణంలో కాబోయే కోడలు 'రాధిక మర్చంట్'కు ఖరీదైన గిఫ్ట్స్ అందించారు.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు జరగనున్నాయి. అంతకంటే ముందు అత్తింటి వారు కాబోయే కోడలికి సుమారు రూ.4.5 కోట్ల విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మి గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ వంటి వాటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాధికా మర్చంట్ గతంలో ఓ పార్టీలో తన అత్తగారికి చెందిన డైమండ్ చౌకర్‌ ధరించి కనిపించింది. ఇది విలువైన ముత్యాలు, వజ్రాలతో పొడిగినట్లు తెలుస్తోంది. అంత కంటే ముందు సోనమ్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు నీతా అంబానీ అదే నెక్లెస్ ధరించడం గమనార్హం.

ఇదీ చదవండి: అంబానీ ఇంట పెళ్లి సంబరాలు.. ఇంటర్నేష‌న‌ల్‌ సెల‌బ్రిటీలు ఇండియాకు..

వచ్చే నెల ప్రారంభంలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ వంటి వాటితో పాటు ఇవాంకా ట్రంప్ కూడా ఉన్నట్లు సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)