అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు!

Published on Mon, 08/18/2025 - 14:23

రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పులు భారీగా పెరిగిపోయాయి. మంచి లాభాల్లో నడుస్తున్న, దేశంలోనే అత్యంత  సంపన్నుడైన ముఖేష్‌ అంబానీకి చెందిన కంపెనీకి అప్పులేంటి అనుకుంటున్నారా?  కంపెనీ ఎంత లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ వ్యాపారాలను విస్తరించడానికి అప్పులు అవసరమవుతాయి.  రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ రంగాల్లో దూకుడుగా పెట్టుబడులను కొనసాగిస్తోంది. అందుకే అప్పులు పెరిగాయి.

ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం.. కంపెనీ మొత్తం అప్పు రూ.3.47 లక్షల కోట్లు కాగా, నికర రుణం రూ.1.17 లక్షల కోట్లు. గతేడాది అంటే 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అప్పు రూ.3.24 లక్షల కోట్లు. బలమైన ఆర్థిక స్థితిని కొనసాగిస్తూనే వ్యాపారాలను పెంచుకునేందుకు భారీ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

2025 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.1,31,107 కోట్ల మూలధన వ్యయాన్ని చేసింది.  అంతక్రితం ఆర్థిక సంవత్సరం 2023-24లో ఈ మొత్తం రూ.1,31,769 కోట్లుగా ఉంది. వార్షిక నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరం పెట్టుబడులలో ఎక్కువ భాగం క్రూడాయిల్‌ నుంచి కెమికల్స్‌ తయారు చేసే 
కొత్త ఓ2సీ ప్రాజెక్టులు, రిటైల్ స్టోర్ల ఏర్పాటు, డిజిటల్ సర్వీసుల పెంపు,  నూతన ఇంధన వెంచర్లను అభివృద్ధి వైపు మళ్లించింది రిలయన్స్ ఇండస్ట్రీస్.  

ఇక ఆదాయం విషయానికి వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.5,57,163 కోట్ల ఆదాయం ఆర్జించింది.  అంతక్రితం ఏడాది రూ.5,74,956 కోట్లతో పోలిస్తే ఇది 3.1 శాతం తక్కువ. కంపెనీ ఎబిటా గత ఏడాది రూ.86,393 కోట్ల నుంచి 14.2 శాతం క్షీణించి రూ.74,163 కోట్లకు పరిమితమైంది.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)