Breaking News

జియో ఫైనాన్షియల్‌కు భారీగా నిధులు

Published on Thu, 09/04/2025 - 17:24

విస్తరణకు వీలుగా జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీలు తాజాగా రూ. 3,956 కోట్ల పెట్టుబడులు సమకూర్చాయి. ఒక్కో వారంట్‌కు రూ. 316.5 ధరలో కంపెనీ బోర్డు 50 కోట్ల వారంట్లను జారీ చేసింది. వెరసి ప్రమోటర్‌ సంస్థలు సిక్కా పోర్ట్స్‌ అండ్‌ టెర్మినల్స్, జామ్‌నగర్‌ యుటిలిటీస్‌ అండ్‌ పవర్‌కు 25 కోట్లు చొప్పున వారంట్లను అందుకున్నాయి.

తద్వారా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ ఎన్‌బీఎఫ్‌సీ.. జియో ఫైనాన్షియల్‌ రూ. 3,956 కోట్లు అందుకుంది. ఈ ఏడాది జూలైలో ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ ద్వారా ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు మార్పిడికివీలయ్యే వారంట్ల జారీకి కంపెనీ బోర్డు అంగీకరించిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 15,825 కోట్లు సమీకరించేందుకు ప్రణాళికలు వేసింది.

ప్రమోటర్లుగా ముకేశ్‌ అంబానీ కుటుంబంతోపాటు.. ఇతర సంస్థలు ప్రస్తుతం కంపెనీలో ఉమ్మడిగా 47.12 శాతం వాటా కలిగి ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 325 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 418 కోట్ల నుంచి రూ. 619 కోట్లకు జంప్‌ చేసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)