ఏఐపై అంబానీ ఫోకస్‌

Published on Wed, 12/31/2025 - 03:47

న్యూఢిల్లీ: ఆయిల్‌ నుంచి రిటైల్, టెలికం వరకు వివిధ రంగాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రాబోయే రోజుల్లో అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్‌ టెక్‌ దిగ్గజంగా రూపాంతరం చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచుకోవాలని, దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై పది రెట్లు సానుకూల ప్రభావం చూపేలా వ్యవహరించాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనకు తోడ్పడేలా, కంపెనీ ఏఐ మేనిఫెస్టోను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మంగళవారం ఆవిష్కరించారు.

‘మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పురోగతి’గా కృత్రిమ మేధను ఈ సందర్భంగా అభివర్ణించారు. దేశీయంగా డిజిటల్‌ పరివర్తనకు సారథ్యం వహించిన విధంగానే ఏఐ విప్లవానికి కూడా నేతృత్వం వహించాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. భద్రత, విశ్వసనీయత, జవాబుదారీతనం హామీతో ప్రతి భారతీయునికి అతి తక్కువ వ్యయాలతో ఏఐని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్‌ టెక్‌ కంపెనీగా మారే దిశగా రిలయన్స్‌ ముందుకు సాగుతోంది. రిలయన్స్‌ ఏఐ ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాం. కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఇది గైడ్‌గా పనిచేస్తుంది‘ అని అంబానీ పేర్కొన్నారు. 

ఐడియాలకు ఆహ్వానం.. 
టెలికం, రిటైల్, ఎనర్జీ, మెటీరియల్స్, లైఫ్‌ సైన్సెస్, ఆర్థిక సేవలు, మీడియా తదితర వ్యాపార విభాగాలతో పాటు దాతృత్వ కార్యకలాపాలవ్యాప్తంగా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడే ఐడియాలు ఇవ్వాలని ఉద్యోగులను అంబానీ కోరారు. జనవరి 10 నుంచి 26 వరకు కొత్త ఆలోచనలను తెలియజేయాలని సూచించారు. ఏఐ హార్డ్‌వేర్, రోబోటిక్స్‌లాంటి వాటితో సమర్ధత, సుస్థిరత, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

మేనిఫెస్టో ఇలా..
మేనిఫెస్టో మొదటి భాగంలో అంతర్గత పరివర్తన, ఏఐని టెక్నాలజీ ప్రాజెక్టుగా కాకుండా కొత్త పని విధానంగా పరిగణించే అంశాలను చేర్చారు. రెండో భాగంలో దేశీయంగా ఏఐ పరివర్తనకు తోడ్పడే విజన్‌ని పొందుపర్చారు. కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు, నియామకాల నుంచి రిటైర్మెంట్ల వరకు, ప్లాంటు నుంచి పోర్టు వరకు కీలకమైన విధుల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించే విధంగా, నిర్ణయాల ప్రక్రియకు తోడ్పడేలా సంస్థవ్యాప్తంగా ఏఐతో పని విధానాల్లో మార్పులను తొలి భాగంలో ప్రస్తావించారు.

డేటా, సమన్వయం, భద్రత, వివిధ వ్యాపారాలవ్యాప్తంగా పర్యవేక్షణ మొదలైన వాటన్నింటికీ ప్రమాణాలు నిర్దేశించేలా పన్నెండు అంచెల డిజిటల్‌ ఫంక్షనల్‌ కోర్‌  (డీఎఫ్‌సీ) ఉంటుంది. తమ వ్యాపారాలు, దాతృత్వ కార్యకలాపాల ద్వారా ఏఐ ఆధారిత భారతదేశ పరివర్తనకి తోడ్పడాలనే రిలయన్స్‌ ఆకాంక్షలను ప్రతిఫలించేలా రెండో భాగం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, సమ్మిళిత ఆర్థిక సర్వీసులు మొదలైన వాటిల్లో ఏఐ దన్నుతో కొత్త సొల్యూషన్స్, కొత్త మెటీరియల్స్‌ను కనుగొనేందుకు అపార అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు.  

#

Tags : 1

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)