Breaking News

ఒక్కరోజులో అదానీకి చెక్‌! తిరుగులేని ముఖేష్‌ అంబానీ..

Published on Fri, 01/12/2024 - 20:26

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. సంపదలో మళ్లీ తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించి గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో గతంలో 13వ స్థానానికి పడిపోయిన ముఖేష్‌ అంబానీ శుక్రవారం (జనవరి 12) 102 బిలియన్ డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) నికర సంపదతో భారతదేశపు అత్యంత సంపన్నుడిగా మారారు.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అంబానీ తన నెట్‌వర్త్‌కు 24 గంటల్లో దాదాపు 3 బిలియన్‌ డాలర్లు (రూ.24 వేల కోట్లు)  జోడించారు. గురువారం భారతీయ స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ షేర్లు ర్యాలీ చేయడంతో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరారు. గతేడాది క్యూ3 ఫలితాలు వెల్లడించిన తర్వాత 2023 అక్టోబర్‌ నుంచి   రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) షేర్ల విలువ 22 శాతం పెరిగింది. కంపెనీలో ముఖేష్ అంబానీకి 42 శాతం వాటా ఉంది. షేర్ ధర పెరిగిన తర్వాత ఆయన సంపద గణనీయంగా పెరిగింది.

అదానీని అధిగమించి..
వారం రోజుల క్రితమే బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్‌లో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ 96.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో అంబానీని అధిగమించగా ఆసియాలో అత్యంత సంపన్నుడయ్యారు. ఇప్పుడు మళ్లీ ముఖేష్‌ అంబానీ 102 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో అదానీని అధిగమించి అపర కుబేడయ్యారు.

100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి.. 
ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్‌ వంటి వారు ఇప్పటికే ఉండగా ముఖేష్‌ అంబానీ క్లబ్‌లో కొత్తగా చేరారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఇలాన్ మస్క్ 200 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నెట్‌వర్త్‌ కలిగిన ఏకైక వ్యక్తి.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)