Breaking News

ముఖేష్ అంబానీ ఒక ఎత్తైతే.. వారి పిల్లలు అంతకు మించి!

Published on Thu, 04/20/2023 - 17:45

కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కీర్తి పొందిన 'ముఖేష్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వ్యాపార ప్రపంచంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ముందుకు సాగుతున్న ఈ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కాకుండా.. పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.

ముఖేష్ అంబానీ ప్రపంచంలోని 13వ అత్యంత సంపన్న బిలియనీర్‌ స్థానాన్ని సొంతం చేసుకున్నట్లు ఇటీవల ఫోర్బ్స్ నివేదించింది. ఈయన నికర ఆస్తుల విలువ 84.1 బిలియన్ డాలర్లు అని అంచనా. అంబానీ పిల్లలు కూడా తండ్రి వ్యాపారాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ.. తండ్రికి తగ్గ పిల్లలుగా ఖ్యాతి పొందారు. ఇంతకీ ముఖేష్ అంబానీ పిల్లలు రిలయన్స్ గ్రూప్‌లో ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఆకాష్ అంబానీ:
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో చైర్మన్. భారతదేశంలో అతి పెద్ద టెలికాం బిజినెస్ ఆకాష్ నియంత్రణలో ఉంది. అంతే కాకుండా ఈయన ముంబై IPL జట్టుకు కో-ఓనర్ కూడా.

ముంబైలోని క్యాంపియన్ స్కూల్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన ఆకాష్ అంబానీ 2013లో యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత తండ్రి వ్యాపార రంగంలో అడుగులు వేశారు. మొదట్లో జియో ఇన్ఫోకామ్‌లో స్ట్రాటజీ చీఫ్‌గా ప్రారంభమై దానిని వేగంగా అభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. ప్రస్తుతం ఆతని ఆస్తుల విలువ 40 బిలియన్ డాలర్లు.

(ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?)

ఇషా అంబానీ:
ముఖేష్, నీతా అంబానీల కవల పిల్లలు ఇషా, ఆకాష్. వీరి ముగ్గురు పిల్లల్లో 'ఇషా' ఒక్కగానొక్క అమ్మాయి. ఈమె ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ రిటైల్ వ్యాపారానికి బాధ్యత వహిస్తోంది. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ పూర్తి చేసిన తరువాత మిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఇషా అంబానీ ఆస్తుల విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. 

(ఇదీ చదవండి: MG Comet EV: ఇది పొట్టిది కాదండోయ్.. చాలా గట్టిది - బుకింగ్స్ & లాంచ్ ఎప్పుడంటే?)

అనంత్ అంబానీ:
ముఖేష్ అంబానీ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడు అనంత్ అంబానీ. ఈయన రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపారానికి బాధ్యతలు వహిస్తూ.. రిలయన్స్ 02C & రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అని అంచనా. ఇటీవల అనంత్ అంబానీకి రాధిక మర్చంట్‌తో నిశ్చితార్థం జరిగింది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)