Breaking News

అమెరికాలో ముఖేష్‌ అంబానీ భారీ కొనుగోలు!

Published on Sun, 09/14/2025 - 20:31

భారత కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్‌ అంబానీ విదేశాల్లో భారీ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఒక భవనాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. రియల్ డీల్ నివేదిక ప్రకారం.. న్యూయార్క్‌లోని ట్రిబెకా ప్రాంతంలో ఉన్న ఈ భవనాన్ని ఆయన 17.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.145 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నారు.

ముఖేష్‌ అంబానీ కొనుగోలు చేసిన ఈ భవనం ట్రిబెకాలోని 11 హ్యూబర్ట్ స్ట్రీట్ లో ఉంది. టెక్ బిలియనీర్, యుబిక్విటి చైర్మన్, సీఈవో రాబర్ట్ పెరా 2018లో 20 మిలియన్ డాలర్లకు ఈ భవనాన్ని కొనుగోలు చేశారు. తర్వాత దీన్ని చిన్నపాటి మాన్షన్‌గా మార్చాలని అనుకున్నా కుదరలేదు. దీంతో ఈ భవంతి దాదాపు పదేళ్లుగా ఎటువంటి వినియోగం లేకుండా ఖాళీగా ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అమెరికన్ అనుబంధ సంస్థ దీన్ని కొనుగోలు చేసింది. రాబర్ట్ పెరా కొన్న ధర కంటే తక్కువకు దీన్ని విక్రయించడం గమనార్హం.

2023 ఆగస్టులో ముఖేష్‌ అంబానీ మాన్హాటన్ లోని వెస్ట్ విలేజ్ లో ఉన్న తన 9 మిలియన్ డాలర్ల నివాసాన్ని విక్రయించారు. ఆ తర్వాత రెండేళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు న్యూయార్క్‌లో భవంతిని కొనుగోలు చేయడం విశేషం. పెరా ఈ భవనాన్ని 2021లోనే 25 మిలియన్‌ డాలర్లకు అమ్మకానికి పెట్టారు. కానీ ఇప్పుడు ముఖేష్‌ అంబానీ 17.4 మిలియన్‌ డాలర్లకే దీన్ని దక్కించుకున్నారు.

ఇదీ చదవండి: ట్రైనింగ్‌ ఇచ్చినోళ్లనే తీసేశారు.. 500 మంది తొలగింపు!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)