Breaking News

అంబానీ ఇంటికి కొత్త అతిథి.. ఇది చాలా స్పెషల్!

Published on Mon, 12/30/2024 - 14:46

భారతీయ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మరో విలాసవంతమైన ఎలక్ట్రిక్ కారును (Electric Car) కొనుగోలు చేశారు. ఇది అంబానీ బ్యారేజిలో చేరిన 'రోల్స్ రాయిస్' (Rolls Royce) బ్రాండ్ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్. దీని ధర రూ. 7.5 కోట్లు (ఎక్స్ షోరూమ్).

అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు పేరు 'స్పెక్టర్' (Spectre). ఈ కారుకు MH 0001 అనే వీఐపీ నెంబర్ ప్లేట్ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ కోసం కూడా వారు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఎంత వెచ్చించారు అనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.

అంబానీ కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు కస్టమైజ్డ్ అని తెలుస్తోంది. కాబట్టి దీని ధర ఎక్స్ షోరూమ్ ధర కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ కారు 102 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఒక సింగిల్ ఛార్జితో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇది కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

ఇదీ చదవండి: ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!

స్పెక్టర్ అనేది రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ కారును ఇప్పటికే మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', కేరళకు చెందిన ఒక బిల్డర్ కూడా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls Royce Spectre)
రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన స్పెక్టర్ కారు ధర రూ. 7 కోట్ల కంటే ఎక్కువ. కాబట్టి దీనిని సామాన్య ప్రజలు కొనుగోలు చేయడం కష్టం. ఇప్పటి వరకు భారతదేశంలో ఈ కారును 10మంది కంటే తక్కువే.. దీనిని కొనుగోలు చేసినట్లు సమాచారాం. అయితే ఈ కారు చూడటానికి మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.

ఇదీ చదవండి: రూ.15 లక్షలుంటే చాలు.. ఇందులో ఓ కారు మీ సొంతం!

అంబానీ గ్యారేజిలోని కార్లు (Mukesh Ambani Car Collection)
భారతీయ కుబేరుడు ముకేశ్ అంబానీ గ్యారేజిలో.. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఈడబ్ల్యుబీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్660 గార్డ్, మాట్ బ్లాక్ బీఎండబ్ల్యూ 760ఎల్ఐ, ఫెరారీ 812 సూపర్‌ఫాస్ట్, బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, మెర్సిడెస్ ఏఎంజీ జీ63, టెస్లా మోడల్ ఎస్ 100డీ, రోల్స్ రాయిస్ కల్లినన్, మెర్సిడెస్ మేబ్యాక్ 62, ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్, ఆస్టన్ మార్టిన్ రాపిడ్, లంబోర్ఘిని ఉరుస్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఆర్మర్డ్ బీఎండబ్ల్యూ 760 ఎల్ఐ, బెంట్లీ బెంటయ్గా, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం మీద అంబానీ గ్యారేజిలో సుమారు 170 కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు  సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)