Breaking News

ముకేశ్ అంబానీ వంటమనిషి జీతం ఎంతంటే?

Published on Sat, 03/18/2023 - 09:23

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరుగా ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా శాఖాహారమే తీసుకోవడం గమనార్హం. ఇటీవల అంబానీ డ్రైవర్‌కు ఇచ్చే జీతం గురించి తెలిసింది, కాగా ఇప్పుడు వంటమనిషికి ఎంత జీతం ఇస్తారన్నది వెలుగులోకి వచ్చింది.

చాలా సాధారణమైన ఆహారం తీసుకునే ముకేశ్ అంబానీ ఎక్కువగా పప్పు, చపాతీ, అన్నం తింటారని, అంతే కాకుండా అప్పుడప్పుడు సరికొత్త వంటకాలు కూడా రుచిచూస్తారని సమాచారం. అంబానీ ఆహారపు అలవాట్లు ఆయన సాధారణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తాయని చెబుతారు.

ముకేశ్ అంబానీకి సాధారణ వంటకాలతో పాటు థాయ్ వంటకాలంటే కూడా చాలా ఇష్టమని సన్నిహితులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆదివారం రోజు ఇడ్లీ సాంబార్ ఉండి తీరాల్సిందే అంటున్నారు. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్న రాత్రి భోజం మాత్రం కుటుంబంతో కలిసి చేస్తారని గతంలో నీతా అంబానీ చెప్పారు.

(ఇదీ చదవండి: భారత్‌లో మారుతి బ్రెజ్జా సిఎన్‌జి లాంచ్.. పూర్తి వివరాలు)

అంబానీ ప్రతి రోజు తీసుకునే ఆహారానికి సంబంధించి కీలక పాత్ర చెఫ్‌ది (వంట మనిషి) అనే చెప్పాలి. ఎప్పుడు ఏమి తింటారనేది కూడా వారే చూసుకుంటారు. ఇంతలా జాగ్రత్తలు తీసుకునే వంటమనిషి జీతం భారతదేశంలో ఉన్న కొంత మంది ఎమ్మెల్యేల జీతంకంటే ఎక్కువని తెలుస్తోంది. సుమారు అంబానీ వంటమనిషి జీతం రూ. 2 లక్షల కంటే ఎక్కువే అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)