Breaking News

Radhika Merchant Arangetram: అదిరింది.. అంబానీ కాబోయే కోడలి అరంగేట్రం

Published on Mon, 06/06/2022 - 08:13

ముంబై:  నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో మారుమోగే నగరం ముంబై. కొద్దినెలలుగా చడీచప్పుడూ లేకుండా మూగబోయింది. కానీ ఆదివారం జరిగిన ఓ భరత నాట్య ప్రదర్శన మాత్రం అంతటా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ–నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీకి కాబోయే భార్య రాధికా మర్చంట్‌ భరతనాట్యం అరంగేట్ర కార్యక్రమం అది. అక్కడి జియో వరల్డ్‌ సెంటర్‌లోని గ్రాండ్‌ థియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మర్చంట్, అంబానీ కుటుంబాల వారితోపాటు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్‌ ప్రముఖులు కూడా తరలి వచ్చారు. 

కృష్ణుడు–గోపిక
నాట్య గురువు భావన ఠాక్రే వద్ద సుమారు ఎనిమిదేళ్లుగా భరత నాట్యం నేర్చుకుంటున్న రాధికా మర్చంట్‌.. ఆదివారం తన అరంగేట్రంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దైవానికి పుష్పాంజలి సమర్పించి.. గణేశ వందనంతో నాట్యాన్ని ప్రారంభించారు. రాగమాలిక, రాముడి కోసం శబరి పడిన తపన, కృష్ణుడు–గోపికల నృత్యం, యశోదా కృష్ణుల కథ, నటరాజ నృత్యం వంటి అంశాలను ప్రదర్శించారు. చివరగా అష్టరసాలు, థిల్లానా నృత్యంతో ముగించారు. రాధికా మర్చంట్‌ నాట్యానికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.  భారత సంస్కృతిలో భాగమైన భరత నాట్యం సంప్రదాయాన్ని మున్ముందు కొనసాగించేందుకు మరో కళాకారిణి రూపంలో రాధికా మర్చంట్‌ తెరపైకి వచ్చారని అతిథులు అభినందించారు. 

నీతా అంబానీ కూడా.. 
అంబానీల కుటుంబంలో రాధికా మర్చంట్‌ రెండో భరత నాట్య కళాకారిణి కానుంది. ముఖేశ్‌ అంబానీ భార్య నీతా కూడా భరతనాట్య కళాకారిణి. దేశ విదేశాల్లోని తమ కంపెనీల బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్నా కూడా నీతా అంబానీ భరత నాట్యాన్ని సాధన చేస్తూనే ఉంటారు.   

చదవండి: అయ్యయ్యో అదానీ...అదరగొట్టిన అంబానీ

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)