రిలయన్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు

Published on Fri, 01/24/2025 - 12:21

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను నిర్మించనున్నట్లు రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) ప్రకటించారు. భారతదేశంలో కృత్రిమ మేధ (AI), డిజిటల్ మౌలిక సదుపాయాలకు డిమాండ్‌ పెరుగుతుండడంతో రిలయన్స్ ఈ ప్రకటన చేయడం టెక్‌ వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా ఆధారిత టెక్‌ కంపెనీ ఎన్విడియా సహకారంతో అత్యాధునిక బ్లాక్‌వెల్‌ ఏఐ ప్రాసెసర్లతో నడిచే ఈ డేటా సెంటర్ మూడు గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

భారతదేశంలో కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అక్టోబర్ 2024లో రిలయన్స్, ఎన్విడియా మధ్య భాగస్వామ్యం కుదిరినట్లు ఇరు సంస్థలు గతంలోనే ప్రకటించాయి. గతంలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్(AI Summit) 2024 సందర్భంగా సంస్థ సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఏఐ విభాగంలో ఇండియా సామర్థ్యాన్ని నొక్కి చెప్పారు. ‘భారతదేశం తన సొంత కృత్రిమ మేధను తయారు చేయడం పూర్తి అర్థవంతమైన చర్యగా భావిస్తున్నాం. స్థానికంగా డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల డేటా భద్రత సవాళ్లు ఏర్పడవు’ అని హువాంగ్ అన్నారు. ఇండియాలో మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ధి కలిగిన ఏఐ ఆవశ్యకతను ఎత్తిచూపుతూ ముఖేష్ అంబానీ ఈ చర్యలు చేపట్టడంతో టెక్‌ నిపుణుల దృష్టిని ఆకర్షించారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు ఏఐ చేదోడు

జామ్‌నగర్‌లో లార్జ్‌ ల్యాంగ్వేజీ మోడల్స్‌తో(ఎల్‌ఎల్‌ఎం) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్‌లకు సహకారం, ఏఐ ప్రాజెక్టులు, ఎల్‌ఎల్‌ఎం అభివృద్ధికి రూ.10,000 కోట్లకు పైగా కేటాయించాలని రిలయన్స్‌ నిర్ణయించింది. డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వ మద్దతు కూడా లభిస్తుందని కంపెనీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు వేలాది హై-స్కిల్డ్ ఉద్యోగాలను సృష్టిస్తుందని, ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇండియాను ముందువరుసలో ఉంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. సుస్థిర ఇంధన వనరులకు పెద్దపీట వేసే రిలయన్స్ సోలార్, పవన, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో సహా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఈ డేటా సెంటర్‌కు అవసరమైన ఎనర్జీని సరఫరా చేస్తారని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)