Breaking News

వినోద రంగం@ 100 బిలియన్‌ డాలర్లు

Published on Fri, 05/02/2025 - 01:15

న్యూఢిల్లీ: వచ్చే పదేళ్లలో దేశీ మీడియా, వినోద పరిశ్రమ మూడు రెట్లు పెరిగి, 100 బిలియన్‌ డాలర్లకు చేరనుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. దీనితో లక్షల కొద్దీ ఉద్యోగావకాశాలు వస్తాయని, ఇతర రంగాలూ ప్రయోజనాలను పొందుతాయని వేవ్స్‌ 2025 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. డిజిటల్‌ సాంకేతికతతో కథలను ఆసక్తికరంగా చెప్పే విశిష్ట సామర్థ్యాలు భారత్‌కి సొంతమని అంబానీ వివరించారు. 

మనకు సాటిలేదు..
ప్రపంచంలో సంక్షోభం, అనిశ్చితి పెరిగిపోతున్న నేపథ్యంలో స్ఫూర్తివంతమైన మన కథలు భవిష్యత్తుపై ఆశాభావం కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. వేల కొద్దీ సంవత్సరాలుగా మన పురాణేతిహాసాలు సౌభ్రాతృత్వం, సాహసం, ప్రకృతిపై ప్రేమను చాటి చెప్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులను గెలుచుకున్నాయని అంబానీ వివరించారు. ఈ విషయంలో మరే దేశమూ మనకు సాటిరాదన్నారు. ముక్కలు చెక్కలవుతున్న ప్రపంచాన్ని తిరిగి బాగుచేయడానికి మన కథలను ఆత్మవిశ్వాసంతో మరోసారి పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి సంతాపం తెలిపారు. 90 దేశాల నుంచి 10,000 మంది పైగా ప్రతినిధులు వేవ్స్‌ సదస్సులో పాల్గొంటున్నారు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు