Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
Breaking News
టెక్నాలజీ అప్‌గ్రేడ్‌కు నిధులు
Published on Thu, 11/13/2025 - 08:40
సాంకేతికపరమైన పురోగతికి ప్రత్యేకమైన నిధిని కేటాయించాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎఎంస్‌ఎంఈ) పరిశ్రమలు కేంద్ర ఆర్థిక శాఖను కోరాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్‌ఎంఈల ప్రతినిధులతో నిర్వహించిన బడ్జెట్ ముందస్తు సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది. రుణాలను సులభంగా పొందేలా చర్యలు తీసుకోవాలని, ఎగుమతి అవకాశాలను సులభతరం చేయాలని ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు కోరారు.
వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగం, జీడీపీలో 30 శాతం వాటా కలిగి ఉండడం గమనార్హం. ఎగుమతుల్లో 40 శాతం ఎంఎస్‌ఎంఈలే నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఎంఎస్‌ఎంఈ శాఖ సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
లఘు ఉద్యోగ్ భారతి, కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్, తిరుపూర్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యుర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. రానున్న బడ్జెట్‌కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన మూడో సమావేశం ఇది. ఈ వారంలోనే వివిధ ఆర్థిక వేత్తలు, వ్యవసాయ రంగం, పరిశోధన సంస్థల ప్రతినిధులతోనూ ఆర్థిక మంత్రి భేటీ కావడం గమనార్హం.
ఇదీ చదవండి: మార్జిన్ ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి
Tags : 1