Breaking News

ఎంఎస్‌ఎంఈకి ప్రత్యేక ప్యాకేజ్‌!

Published on Wed, 01/24/2024 - 02:51

న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌లో తనకు ప్రత్యేక ప్యాకేజ్‌ ఉంటుందని లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ) భావిస్తోంది. భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతున్న నేపథ్యంలో.. ఎకానమీలో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా తగిన కనిష్ట స్థాయి రుణ రేట్లు పరిశ్రమలకు లభిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. స్థూల దేశీయోత్పతిలో ఎంఎస్‌ఎంఈ రంగం వాటా 29.15 శాతం కావడం గమనార్హం.

బ్యాంకులు– ఎంఎస్‌ఎంఈల మధ్య సంబంధం అసమానంగా ఉందని, రుణ దాతల విచక్షణ పరిధిలో అసతౌల్యతకు గురవుతోందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మైక్రో అండ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఐఎస్‌ఎంఈ) సెక్రటరీ జనర ల్‌ అనిల్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బడ్జెట్‌ ప్రయతి్నస్తుందన్న విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు.

దేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈ నిర్దిష్ట ఉత్పత్తుల ఎగుమతి వాటా 2023–24లో (సెపె్టంబర్‌ 2023 వరకు) 45.56 శాతంగా ఉంది. ఇది 2022–23లో 43.59 శాతం.  కన్స ల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఎంఎస్‌ఎంఈలకు మూలధన ప్రవాహాలలో నష్టాలను తగ్గించడానికి క్రెడిట్‌ గ్యారెంటీలు, బీమా పథకాల వంటి నష్ట నివారణ సాధనాలను ప్రోత్సహించడం మంచిని పేర్కొన్నారు.  

ముఖ్యంగా ఆటో మోటివ్, ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్, ఎలక్ట్రికల్‌ మెషినరీ, కెమికల్స్‌ వంటి పరిశ్రమలకు ఈ తరహా చర్యలు అవసరమని వివరించారు.  6 శాతం మాత్రమే ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌ విక్రయాల్లో ఎంఎస్‌ఎంఈ పాత్ర కేవలం 6 శాతంగా ఉంటోందని పరిశ్రమ పేర్కొంటోంది.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)