Breaking News

ఎంఆర్‌ఎఫ్‌కు ఎక్స్‌ప్రెస్‌ లాభాలు

Published on Fri, 08/04/2023 - 06:11

న్యూఢిల్లీ: టైర్ల రంగంలో అగ్రగామి సంస్థ ఎంఆర్‌ఎఫ్‌ జూన్‌తో అంతమైన మూడు నెలల కాలంలో తన పనితీరును గణనీయంగా మెరుగుపరుచుకుంది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఐదు రెట్లు పెరిగి రూ.589 కోట్లకు దూసుకుపోయింది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం సైతం రూ.6,440 కోట్లకు వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.123 కోట్లు, ఆదాయం రూ.5,696 కోట్ల చొప్పున ఉన్నాయి. ముఖ్యంగా ముడిసరుకుల వ్యయాలు తగ్గడం కలిసొచి్చంది.

ముడి సరుకులపై చేసిన వ్యయాలు రూ.3,781 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ముడి సరుకుల కోసం అయిన వ్యయాలు రూ.4,114 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాలు రూ.5,567 కోట్ల నుంచి రూ.5,728 కోట్లకు పెరిగాయి. ఎండీగా ఉన్న కేఎం మామెన్‌ను చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా 2024 ఫిబ్రవరి 8 నుంచి ఐదేళ్ల కాలానికి నియమిస్తూ కంపెనీ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. విమలా అబ్రహాంను ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా రెండో విడత మరో ఐదేళ్ల కాలానికి నియమించింది. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)