Breaking News

ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఫండ్‌లు

Published on Mon, 07/28/2025 - 17:20

మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. స్పెషల్‌ అపార్చూనిటీస్‌ ఫండ్‌ పేరుతో న్యూ ఫంఢ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌వో)ను ప్రకటించింది. ఆగస్ట్‌ 8తో ముగుస్తుంది. తిరిగి ఆగస్ట్‌ 21 నుంచి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపార పరంగా ప్రత్యేక అవకాశాలను చూస్తున్న కంపెనీల్లో ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. కార్పొరేట్‌ స్థాయిలో కంపెనీ వ్యాపారాల విభజన, విలీనాలు, కొనుగోళ్లు, ప్రభుత్వ విధానాల్లో మార్పులు, ఏదైనా రంగాల్లో కొత్తగా అవకాశాలు ఏర్పడుతుండడం, నియంత్రణపరమైన మార్పులను అవకాశాలుగా మలుచుకుని ఇన్వెస్ట్‌ చేస్తుంది.

కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పెట్టుబడిని మొదటి మూడు నెలల్లో వెనక్కి తీసుకుంటే 1% ఎగ్జిట్‌ లోడ్‌ చార్జీ పడుతుంది. ఆ తర్వాత ఉపసంహరణపై ఎలాంటి చార్జీలుండవు. ఈ పథకంలో రిస్క్‌ ఎక్కువ. నిఫ్టీ 500 టీఆర్‌ఐ ఈ పథకం పనితీరుకు ప్రామాణికం. అజయ్‌ ఖండేల్‌వాల్, అతుల్‌ మెహ్రా, బాలచంద్ర షిండే, రాకేశ్‌ శెట్టి, సునీల్‌ సావంత్‌ ఫండ్‌ మేనేజర్లుగా సేవలు అందించనున్నారు.  

జెరోధా మల్టీ అస్సెట్‌ ప్యాసివ్‌ ఎఫ్‌వోఎఫ్‌ 
జెరోధా మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా జెరోదా మల్టీ అస్సెట్‌ ప్యాసివ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ (ఎఫ్‌వోఎఫ్‌)ను ప్రారంభించింది. ఈక్విటీ, డెట్‌ ఇండెక్స్‌ ఫండ్స్‌/ఈటీఎఫ్‌లు, కమోడిటీ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఆగస్ట్‌ 8న ఎన్‌ఎఫ్‌వో ముగుస్తుంది. ఐదు పనిదినాల అనంతరం తిరిగి క్రయ, విక్రయాలకు అందుబాటులోకి వస్తుంది. ఈక్విటీ, డెట్, కమోడిటీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుంది.

పోర్ట్‌ఫోలియోకి రిస్క్, అస్థిరతలు తగ్గించడం ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా 50–70 శాతం పెట్టుబడులను ఈక్విటీ ఈటీఎఫ్‌/ఇండెక్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. 10–20 శాతం డెట్‌ ఈటీఎఫ్‌/ఇండెక్స్‌ ఫండ్స్, 20–30 శాతం కమోడిటీ ఈటీఎఫ్‌లకు (బంగారం, వెండి) కేటాయిస్తుంది. పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని చూసే వారి కోసం ఈ పథకం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)