Breaking News

మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రమోటర్ల దాతృత్వం

Published on Sat, 07/29/2023 - 06:27

న్యూఢిల్లీ: మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రమోటింగ్‌ కంపెనీ మోతీలాల్‌  ఓస్వాల్, ప్రమోటర్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్‌ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది.

ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్‌జీ, గౌతమ్‌ అదానీ, శివ్‌నాడార్, నందన్‌ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని గ్లైడ్‌ టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్‌ టెక్‌ అనేది మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్‌ ఓస్వా ల్‌ ఫైనాన్షియల్‌కు మార్చేందుకు నిర్ణయించింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)