Breaking News

2022లో మోస్ట్ పాపులర్ కారు, బైక్.. మీకు తెలుసా?

Published on Tue, 02/28/2023 - 15:02

భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ డ్రూమ్ “ఇండియా ఆటోమొబైల్ ఇకామర్స్ రిపోర్ట్ 2022” పేరుతో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కార్ల విభాగంలో హ్యుందాయ్ క్రెటా, బైక్స్ విభాగంలో బజాజ్ పల్సర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలుగా గుర్తింపు పొందాయి.

మన దేశంలో ప్యాసింజర్​ వాహనాల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్​ మార్కెట్​గా కీర్తి పొందగలిగింది. దేశంలో ప్రస్తుతం కొరియన్ కంపెనీ కార్ల హవా జోరుగా సాగుతోంది. 2022లో ఎక్కువ అమ్మకాలు పొందిన, ఎక్కువమంది కొనుగోలుదారుల మనసుదోచిన కారుగా క్రెటా నిలిచింది. ఆ తరువాత స్థానంలో మారుతి సుజుకి బ్రెజ్జా, ఇన్నోవా క్రిస్టా నిలిచాయి.

2022లో లగ్జరీ కార్ల విభాగంలో మెర్సిడెస్​ బెంజ్​ ఈ-క్లాస్ ఎక్కువ ప్రజాదరణ పొందిన కారుగా గుర్తింపు పొందగా, తరువాత స్థానంలో జీప్ కంపాస్, బెంజ్​ సీ క్లాస్​, బీఎండబ్ల్యూ5 సిరీస్ చేరాయి.

ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ పల్సర్ ఎక్కువ ప్రజాదరణ పొందిన బైకుగా మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత స్థానాల్లో హీరో స్ప్లెండర్​ ప్లస్​, బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​, టీవీఎస్​ అపాచీ ఆర్​టీఆర్​, హోండా సీబీ షైన్​ వంటివి నిలిచాయి. లగ్జరీ బైక్స్​ సెగ్మెంట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇంటర్​సెప్టర్​, హార్లీ డేవిడ్​సన్​ స్ట్రీట్​ 750, కవాసాకీ నింజా జెడ్​ఎక్స్​-10ఆర్​ వంటివి ఎక్కువ అమ్మకాలు పొందినట్లు నివేదికల ద్వారా తెలిసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)