యువతను ఆకర్షిస్తున్న ఫేస్‌బుక్‌

Published on Sat, 06/01/2024 - 09:54

మెటా ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్‌ సంస్థ తన బేస్‌ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్‌తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది.

టిక్‌టాక్‌తో పోటీపడేలా ఫేస్‌బుక్‌లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్‌ ఫీచర్‌ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యూఎస్‌, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్న 40 మిలియన్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాలవారీగా డెమోగ్రఫిక్‌ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్‌బుక్‌ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: తగ్గనున్న ద్రవ్యోల్బణం.. ఆర్‌బీఐ నివేదిక

యువత యాప్‌ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్‌లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్‌బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ..‘చైనాకు చెందిన బైట్‌డాన్స్ యాజమాన్యంలోని స్మాల్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తనవైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తరువాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్‌ప్లేస్‌, గ్రూప్‌లు, స్మాల్‌ వీడియా ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్‌ లేదా రీల్స్‌ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004నుంచి మూడేళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది’ అన్నారు.

#

Tags : 1

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)