మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
యూనియన్‌బడ్జెట్23: రైల్వేలకు భారీ కేటాయింపులు
Published on Wed, 02/01/2023 - 12:12
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో రైల్వేలకు భారీ కేటాయింపులను చేస్తున్నట్టు ప్రకటించారు. రైల్వేల కోసం రూ. 2.4 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇది దాదాపు పదేళ్లలో అత్యధికం, గత సంవత్సరం బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని ఆమె ఈ సందర్భంగా చెప్పనారు.
అంతేకాదు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దేశాన్ని పరిపాలించిన సంవత్సరంతో పోల్చుతే ఇది 2013-14లో చేసిన వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ అంటూ ఆర్థికమంత్రి నొక్కిచెప్పారు. క్రిటికల్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల కోసం ఆమె రూ. 75,000 కోట్లను కూడా ప్రకటించింది, ఇది రైల్వేలకు కూడా ప్రత్యేకంగా దాని సరుకు రవాణా వ్యాపారంలో సహాయపడే అవకాశం ఉందన్నారు.
Tags : 1