Breaking News

లేఆఫ్స్‌ విధ్వంసం: ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది ఇంటికి..

Published on Mon, 07/03/2023 - 16:04

కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఈ ఏడాది (2023) ప్రథమార్థంలో గ్లోబల్ టెక్ సెక్టార్‌లో పెద్ద కంపెనీలు మొదలుకుని స్టార్టప్‌ల వరకు 2.12 లక్షల మందికిగా ఉద్యోగాలు కోల్పోయారు.  లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ ‘లేఆఫ్స్ డాట్‌ ఎఫ్‌వైఐ’ గణాంకాల ప్రకారం.. జూన్ 30 వరకు 819 టెక్ కంపెనీలు 212,221 మంది ఉద్యోగులను తొలగించి ఇంటికి పంపాయి.

ఏడాదిన్నరలో 3.8 లక్షల మంది.. 
గతేడాది (2022) 1,046 టెక్ కంపెనీలు 1.61 లక్షల మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. 2022 సంవత్సరంతోపాటు 2023 జూన్ వరకు మొత్తంగా దాదాపు 3.8 లక్షల మంది టెక్ ఉద్యోగులు తమ జాబ్స్‌ కోల్పోయారు. ఇదిలా ఉంటే మరికొన్ని పెద్ద  టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగింపును కొనసాగిస్తున్నాయి. గతంలో లెక్కకు మించి చేపట్టిన నియామకాలు, ప్రపంపవ్యాప్తంగా అనిశ్చిత ఆర్థిక పరిస్థితులు, కోవిడ్ సంక్షోభం నుంచి తగిలిన బలమైన దెబ్బలను ఆయా కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు కారణాలుగా చెబుతున్నాయి.

 

భారత్‌లోనూ దారుణంగానే పరిస్థితి
భారతీయ టెక్‌ పరిశ్రమలోనూ పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ సంవత్సరం (2023) జూన్‌ చివరినాటి వరకు 11,000 మందికి పైగా భారతీయ స్టార్టప్ ఉద్యోగులు జాబ్స్‌ కోల్పోయారు. 2022 ఇదే కాలంలో పోల్చితే ఇది దాదాపు 40 శాతం ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల తొలగింపులలో 5 శాతం భారత్‌లోనే జరిగాయి. Inc42 డేటా ప్రకారం.. 2022లో ఫండింగ్ మందగమనం స్థిరపడినప్పటి నుంచి ఇప్పటి వరకు 102 భారతీయ స్టార్టప్‌లు 27,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించాయి. ఐదు ఎడ్‌టెక్ యునికార్న్‌లు సహా దాదాపు 22 ఎడ్‌టెక్ స్టార్టప్‌లు ఇప్పటివరకు దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి.

ఇదీ చదవండి: మాదేం లేదు! వర్క్‌ ఫ్రం ఆఫీస్‌పై ఇన్ఫోసిస్‌ సీఈవో కీలక వ్యాఖ్యలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)