Breaking News

వర్ధమాన దేశాల్లో భారత్‌ భేష్‌

Published on Thu, 04/03/2025 - 08:39

న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ అత్యధిక వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ తెలిపింది. బడ్జెట్‌లో ఆదాయపన్ను పరంగా భారీగా కల్పించిన పన్ను మినహాయింపు ప్రయోజనాలు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రస్తావించింది. ఈ చర్యలతో భారత్‌ మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా వేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5% వృద్ది రేటును సాధించొచ్చన్న అంచనాలను ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి మూడీస్‌ వృద్ధి అంచనాలు 6.7%తో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. ద్రవ్యోల్బ ణం గత ఆర్థిక సంవత్సరంలో సగటున 4.9 శాతంగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో (2025–26)  4.5 శాతానికి దిగొస్తుందని తెలిపింది.

భారత్‌ నిలబడుతుంది..  

వర్ధమాన దేశాల్లోకి పెట్టుబడుల ప్రవాహం, సరఫరా వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాలను యూఎస్‌ వాణిజ్య విధానాలు మార్చివేయనున్నట్టు మూడీస్‌ పేర్కొంది. అయితే, భారత్‌ మాదిరి పెద్ద స్థాయి వర్ధమాన దేశాలు ఈ అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొనేందుకు తగిన వనరులు కలిగి ఉన్నట్టు మూడీస్‌ నివేదిక తెలిపింది. ముఖ్యంగా అమెరికా విధానాలతో వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు బయటకు తరలిపోయే రిస్క్‌ను ప్రస్తావించింది.

ఇదీ చదవండి: టారిఫ్‌లపై కంట్రోల్‌ రూమ్‌..

భారత్, బ్రెజిల్‌ మాత్రం పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు, వాటిని కాపాడుకునేందుకు మెరుగైన స్థితిలో ఉన్నట్టు తెలిపింది. ఈ రెండూ దేశీ వినియోగంపై ఆధారపడిన అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడం, బలమైన దేశీ క్యాపిటల్‌ మార్కెట్లకు తోడు స్థిరమైన విదేశీ మారకం నిల్వలు కలిగి ఉన్నాయని గుర్తు చేసింది. దేశీ కరెన్సీ ఆధారిత విదేశీ రుణ భారం ఎక్కువగా కలిగి ఉన్నందున.. విదేశీ మారకం రిస్క్‌లను భారత్‌ బలంగా ఎదుర్కోగలదని అంచనా వేసింది. ఈ సానుకూలతలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కలిగించగలవని పేర్కొంది. భారత్‌ వృద్ధి రేటు 2025–26లో నిదానించినప్పటికీ బలంగానే కొనసాగుతుందని, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే అధిక వృద్ధి రేటును నమోదు చేస్తుందని వివరించింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)