Breaking News

జీడీపీ వృద్ధి 6.3 శాతమే! కారణం..

Published on Wed, 05/07/2025 - 09:20

భారత జీడీపీ 2025లో 6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మూడీస్‌ రేటింగ్స్‌ తాజా అంచనాలు ప్రకటించింది. 6.5 శాతం వృద్ధి సాధిస్తుందంటూ గతంలో వెల్లడించిన అంచనాలను తగ్గించింది. అమెరికా టారిఫ్‌లు, వాణిజ్య ఆంక్షలతో వృద్ధి నిదానించొచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక ఉద్రిక్తతలకు తోడు.. భారత్‌–పాక్‌ మధ్య ఉద్రిక్తతలు సైతం జీడీపీ వృద్ధి అంచనాలపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి, ఎక్కడ విస్తరణ చేపట్టాలి, ముడి పదార్థాల సమీకరణ తదితరాల వ్యయాలు పెరిగిపోవ్చని పేర్కొంది. 2026 సంవత్సరానికి మాత్రం లోగడ ప్రకటించిన 6.5 శాతం వృద్ధి రేటు అంచనాలనే మూడీస్‌ కొనసాగించింది. 2024 కేలండర్‌ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా ఉండడం గమనార్హం. విధానపరమైన అస్పష్టత, అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో 2025, 2026 సంవత్సరాలకు సంబంధించి అంతర్జాతీయ వృద్ది రేటు అంచనాలను తగ్గిస్తున్నట్టు మూడీస్‌ రేటింగ్స్‌ తెలిపింది.

ప్రపంచ వృద్ధిపైనా ప్రభావం..

టారిఫ్‌లకు అమెరికా స్వల్పకాలం పాటు విరామం ఇచి్చనప్పటికీ చైనా–అమెరికా మధ్య ఉద్రిక్తతలు జీ–20 దేశాల వ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలిగిస్తాయని మూడీస్‌ రేటింగ్స్‌ తెలిపింది. 2025లో అమెరికా, చైనా జీడీపీ అంచనాలను సైతం కుదించింది. అమెరికా జీడీపీ 2025లో 1 శాతం, 2026లో 1.5 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా వేసింది. గత అంచనాలు కుదించింది. చైనా 2025లో 3.8 శాతం, 2026లో 3.9 శాతం చొప్పున వృద్ధి చెందొచ్చని పేర్కొంది. 

ఇదీ చదవండి: ఎన్‌బీఎఫ్‌సీ గోల్డ్‌ లోన్లకు కష్టాలు

మొత్తం మీద అమెరికాకు సంబంధించి టారిఫ్‌లు గరిష్ట స్థాయికి చేరాయని.. రానున్న రోజుల్లో ఇవి తగ్గుతాయని అంచనా వేస్తున్నట్టు తెలిపింది. తరచుగా ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలు లిక్విడిటీని (ద్రవ్య లభ్యత) కఠినతరం చేస్తాయని, ఇది నిధులపై వ్యయాలు గణనీయంగా పెరిగేందుకు దారితీస్తుందని మూడీస్‌ తెలిపింది. వృద్ధికి ఇది విఘాతం కలిగించొచ్చని పేర్కొంది.
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)