Breaking News

పదేళ్ల ముందు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఖర్చు ఎంతో తెలుసా?

Published on Sun, 02/25/2024 - 13:40

భారత్ లో ఇంటి ఖర్చులు విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది. గత దశాబ్ధ కాలంగా ఇది ఎక్కువగా ఉన్నట్లు  పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  దేశంలో 2011-12 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో తలసరి నెలవారీ గృహ వ్యయం రెట్టింపుకు పైగా పెరిగిందనే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) తాజా సర్వే గణాంకాలు చెబుతున్నాయి.  

గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) పేరుతో 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. ఇందులో భారత్‌లో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.2,630 ఉండగా, 2022-23 నాటికి రెట్టింపు పెరిగి రూ.6,459కి చేరింది.

గ్రామీణ కుటుంబాల ఖర్చులు కూడా ప్రస్తుత ధరల ప్రకారం 2012 ఆర్థిక సంవత్సరంలో రూ .1,430 నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .3,773 కు పెరిగాయి.

2011-12 ధరల వద్ద సగటు ఎంపీసీఈ 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.2,630 నుండి 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .3,510కు పెరిగింది. 2012 ఆర్థిక సంవత్సరంలో రూ .1,430  ఉండగా 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.2,008కి చేరింది.

పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుత ధరల ప్రకారం 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.2,630గా ఉన్న సగటు ఎంపీసీఈ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.6,521కి, గ్రామీణ ప్రాంతాల్లో 2012 ఆర్థిక సంవత్సరంలో రూ.1,430 ఉంది. ఆ మొత్తం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.3,860కి చేరింది. 

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన కేంద్ర నమూనాలో గ్రామీణ ప్రాంతాల్లో 1,55,014 ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 1,06,732 గృహాలతో కలిపి మొత్తం 2,61,746 ఇళ్ల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా వ్యయాల అంచనాలను లెక్కించారు. గణాంకాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వరుసగా మొదటి వినియోగదారుల వ్యయ సర్వే (సిఇఎస్) ఇది, రెండవది ప్రస్తుతం ఆగస్టు 2023 నుండి 12 నెలల కాలానికి కొనసాగుతోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ), ప్రధాన ద్రవ్యోల్బణ రేటును అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ముఖ్యమైనది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు