Breaking News

వర్షం వచ్చిందంటే ఈ గాడ్జెట్స్‌ ఉండాల్సిందే..

Published on Sun, 06/08/2025 - 15:13

వానొచ్చిదంటే ఎన్నో సరదాలను తెస్తుంది. వాటితో పాటు ఎన్నో సమస్యలను కూడా! అయితే, వాన తెచ్చే తిప్పల్లో అన్నీ కాకపోయినా కొన్నింటికి చెక్‌ పెట్టే స్మార్ట్‌ సొల్యూషన్సే ఈ గాడ్జెట్స్‌!

వాటర్‌ప్రూఫ్‌ బ్లూటూత్‌ స్పీకర్‌
వాన పడుతుంటే చాలామంది చాయ్‌లో బిస్కట్‌ ముంచేస్తారు. కాని, అంతకంటే ఎక్కువమంది  వానలో మంచి మ్యూజిక్‌తో మూడ్‌ని మిక్స్‌ చేసి ఎంజాయ్‌ చేస్తుంటారు. అలాగని, వర్షంలో స్పీకర్‌ పెడితే అప్పుడు అది సింకింగ్‌ షిప్‌ అయిపోతుంది. ఇందుకోసమే ఓ అద్భుతమైన ఆవిష్కరణ వచ్చేసింది. వాటర్‌ప్రూఫ్‌ బ్లూటూత్‌ స్పీకర్‌. దీనిని బయటపెట్టి మ్యూజిక్‌ ప్లే చేస్తే రెయిన్‌ డాన్స్‌ పార్టీని క్రియేట్‌ చేయొచ్చు. ధర వివిధ బ్రాండ్స్, డిజైన్స్‌ బట్టి ఉంటుంది. ఆన్‌లైన్‌లో లభ్యం.

ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు..
వర్షం వచ్చిన వెంటనే కాఫీ చేతిలో పట్టుకొని, ఓపెన్‌ టెర్రస్‌ మీద సరదాగా ఓ సెల్ఫీ తీసుకోవాలనిపించిందా? కాని, ఫోన్‌ జారిపోతుందేమోననే భయంతో, కేవలం కాఫీనే ఎంజాయ్‌ చేస్తున్నారా? ఇప్పుడు అవన్నీ పాత కథలు! ఎందుకంటే ఇప్పుడు మీ చేతిలోకి వచ్చింది ‘ఇస్టా 360’. ఈ చిన్న గాడ్జెట్‌ తీసే ఫొటోలు, వీడియోలు హాలీవుడ్‌ లెవెల్‌లో ఉంటాయి. అన్ని యాంగిల్స్‌ల్లోనూ అద్భుతంగా తీయగల ఈ చిన్న కెమెరా ఉంటే ఇక పెద్ద పెద్ద కెమెరాలతో పని ఉండదు. పైగా ఇది వర్షం చూసి పారిపోయే కెమెరా కాదు. ఇది తానే నీళ్లలోకి దూకేస్తుంది. అంటే పది మీటర్ల లోతు వరకు వాటర్‌ ప్రూఫ్‌ అన్నమాట. చక్కగా షర్ట్‌కి అంటించి పెట్టుకొని వాడుకోవచ్చు. పైగా కెమెరాను ఎక్కడైనా మర్చిపోతే, మీ ఫోన్‌ మాత్రం ‘ఏయ్, ఇక్కడ ఉంది కెమెరా’ అని ఇందులోని అలర్ట్‌ సిస్టమ్‌ చెప్తుంది. ధర. 599 డాలర్లు (రూ. 51,003).

 

వాన జాడ చెప్పే గొడుగు..
‘వాన వస్తుందా లేదా? గొడుగు తీసుకెళ్దామా? వద్దా?’ అని ఇలా మీలో మీరు ప్రశ్నలు వేసుకునే ముందు ఒక్కసారి ఈ ‘డ్యావెక్‌ అలర్ట్‌ గొడుగు’ను అడిగి చూడండి. వాతావరణం ఎలా ఉండబోతుందో ఈ గొడుగే చెప్తుంది. పైగా దీనిని ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇందులోని అలెర్ట్‌ సిస్టమ్‌ ఎప్పుడైనా గొడుగును తీసుకెళ్లడం మర్చిపోయారో, వెంటనే, టింగ్‌ అని ఫోన్‌కి మెసేజ్‌ వస్తుంది ‘నన్ను మర్చిపోయావ్‌ బాస్‌’ అని గొడుగు మీకు గుర్తుచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గొడుగు కాదు. బ్రహ్మానందం లెవల్‌ కామెడీ ప్లస్‌ స్మార్ట్‌నెస్‌ను కలిపిన వస్తువు. పైగా ఇది సాధారణ గొడుగులా కాకుండా చాలా బలంగా ఉంటుంది. ఈదురు గాలులకు కూడా కదలదు. ఇక దీని స్టయిల్‌లో చూసుకుంటే, పెద్ద పెద్ద డిజైనర్‌ గొడుగులు కూడా దీనితో పోటీ పడలేవు. ధర 69 డాలర్లు (రూ. 5,870).

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)