Breaking News

ఆన్‌లైన్‌ గేమింగ్‌కు మనీ లాండరింగ్‌ ముప్పు

Published on Fri, 10/25/2024 - 06:29

న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగానికి మనీలాండరింగ్‌ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్‌ ఎకానమీని, ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. 

చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్‌లిస్ట్‌ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్‌ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్‌ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

అయిదేళ్లలో 7.5 బిలియన్‌ డాలర్లకు పరిశ్రమ.. 
నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్‌ మనీ గేమింగ్‌ (ఆర్‌ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్‌ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్‌టెక్, క్లౌడ్‌ సర్వీసెస్, సైబర్‌–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. 

నివేదికలోని మరిన్ని విశేషాలు.. 
→ యూజర్‌కు భద్రత, సైబర్‌ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ మార్కెట్లో ఏటా 100 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల 
తీవ్రతకు నిదర్శనం.  
→ చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్‌ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్‌ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని 
ఇది తెలియజేస్తోంది.  
→ దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్‌లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్‌లైన్‌ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్‌ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా  ఉంటున్నాయి. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)