Breaking News

రూ. 120 కోట్లతో మోల్డ్‌టెక్‌ ప్లాంట్లు

Published on Tue, 01/09/2024 - 04:31

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్యాకేజింగ్‌ రంగ సంస్థ మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ రూ.100 కోట్లతో కొత్తగా మూడు ప్లాంట్లను ప్రారంభించింది. తెలంగాణలోని సుల్తాన్‌పూర్, హరియాణాలోని పానిపట్, తమిళనాడులోని చెయ్యార్‌ వద్ద ఏర్పాటయ్యాయి. వీటి మొత్తం వార్షిక సామర్థ్యం 5,500 మెట్రిక్‌ టన్నులు. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ కోసం మహారాష్ట్రలోని మహద్‌ వద్ద రూ.20 కోట్లతో 1,500 మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యం గల ప్లాంటు 2024 అక్టోబర్‌ నాటికి రెడీ అవుతోంది.

2024–25లో మోల్డ్‌టెక్‌ రూ.75–80 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్లు, 2022–23లో రూ.148 కోట్లు వెచ్చించింది. 2024–25లో పరిమాణంలో 15–18 శాతం వృద్ధిని ఆశిస్తోంది.

తాజా విస్తరణతో 2024–25లో మొత్తం వార్షిక తయారీ సామర్థ్యం 54,000 మెట్రిక్‌ టన్నులకు చేరుతుందని మోల్డ్‌టెక్‌ సీఎండీ జె.లక్ష్మణ రావు వెల్లడించారు. ‘కొత్త ప్లాంట్లు కంపెనీ వృద్ధి అవకాశాలను ప్రధానంగా ఫార్మా ప్యాకేజింగ్‌లో మెరుగుపరుస్తాయి. ఫార్మా పరిశ్రమ నుండి మా ఉత్పత్తులకు డిమాండ్‌ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. 2024–25 తొలి త్రైమాసికం నుండి ఫార్మా ప్యాకేజింగ్‌ ఆదాయం తోడవుతుంది. 5–6 ఏళ్లలో మొత్తం ఆదాయంలో ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా విభాగాలు 50 శాతం సమకూర్చాలన్నది మా ప్రణాళిక’ అని తెలిపారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)