Breaking News

కేంద్రం కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు దారులకు శుభవార్త!

Published on Wed, 01/31/2024 - 13:54

పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర వసూలు చేస్తున్న ఇంపోర్ట్‌ డ్యూటీని తగ్గిస్తూ అధికారికంగా ఉత్వరులు జారీ చేసింది. 

భారత్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు స్థానికంగా ఫోన్‌లను తయారు చేయాలంటే.. అందుకు అవసరమయ్యే విడి భాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అలా దిగుమతి చేసుకున్నందుకు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి 15 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీని చెల్లించాలి. అయితే, తాజాగా ఈ ఇంపోర్ట్‌ డ్యూటీని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది.  ఇంకా, ఎల్‌సీడీ ప్యానెల్‌ల డిస్‌ప్లే, అసెంబ్లీ భాగాలపై దిగుమతి సుంకాలు 10శాతానికి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 

దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా యాపిల్‌, శాంసంగ్‌ కంపెనీలు ఎగుమతులు పెంచడంలో సహాయపడుతుందని, తద్వారా స్మార్ట్‌ఫోన్‌ తయారీ మార్కెట్‌లో కీలక పాత్రపోషిస్తున్న చైనా, వియాత్నాం వంటి దేశాలతో భారత్‌ పోటీపడేందుకు అవకాశంగా మారుతుందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఇక దిగుమతి సుంకం తగ్గింపుతో భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.    

మొబైల్‌ విడి భాగాలపై 
మొబైల్‌ తయారీ పరిశ్రమలో భారత్‌ను అగ్రగామిగా నిలిచేందుకు కేంద్రం మొబైల్ ఫోన్ విడి భాగాలపై ఇంపోర్ట్‌ డ్యూటీని తగ్గించింది. సిమ్‌ సాకెట్, బ్యాటరీ కవర్, మెయిన్‌ కవర్, స్క్రూలు, జీఎస్‌ఎం, యాంటెన్నా వంటి మెకానికల్, ప్లాస్టిక్ ఇన్‌పుట్ భాగాలతో పాటు ఇతర మొబైల్‌ ఫోన్‌ విడి భాగాలపై దిగుమతి సుంకం తగ్గనుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)