Breaking News

మొబిక్విక్, క్రెడ్‌లో ఈ–రూపీ వాలెట్లు

Published on Wed, 01/29/2025 - 08:27

డిజిటల్‌ ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంలు మొబిక్విక్, క్రెడ్‌ తాజాగా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ఈ–రూపీ వాలెట్లను ప్రవేశపెట్టాయి. దీనికి యస్‌బ్యాంక్‌తో జతకట్టాయి. యూపీఐ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదును బదలాయించేందుకు, అలాగే వ్యక్తులు.. వ్యాపారవర్గాలకు చెల్లింపులు జరిపేందుకు సర్వీసులు ఉపయోగపడనున్నాయి. 2024లో రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారికంగా డిజిటల్‌ కరెన్సీ ఈ–రూపీని ప్రవేశపెట్టినప్పుడు కేవలం బ్యాంకులకు మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్లు (టీపీఏపీ) కూడా సీబీడీసీ సేవలను అందించేందుకు వెసులుబాటు లభించింది. ఇప్పుడు ఈ–రూపీ వాలెట్ల రోజువారీ లావాదేవీల పరిమితి రూ. 50,000గా ఉండగా, ఒక్కో లావాదేవీ విలువ పరిమితి రూ. 10,000గా ఉంది. అర్థ రూపాయి, 1 రూపాయి నుంచి రూ. 500 వరకు కరెన్సీ డినామినేషన్లలో ఈ–రూపీ అందుబాటులో ఉంటుంది. 

ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌తో ముగిసిన సస్తాసుందర్‌ భాగస్వామ్యం

జెప్టో ‘రివర్స్‌ ఫ్లిప్‌’ పూర్తి..

దేశీయంగా పబ్లిక్‌ ఇష్యూకి వచ్చే దిశగా క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో మరో అడుగు ముందుకు వేసింది. తమ హోల్డింగ్‌ కంపెనీ కిరాణాకార్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రధాన కేంద్రాన్ని సింగపూర్‌ నుంచి భారత్‌కు మార్చుకుంది. రివర్స్‌ ఫ్లిప్‌గా వ్యవహరించే ఈ ప్రక్రియకు సంబంధించి సింగపూర్‌ కోర్టులు, భారత్‌లో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ నుంచి లాంఛనంగా అనుమతులు లభించినట్లు సంస్థ సహ–వ్యవస్థాపకుడు ఆదిత్‌ పలీచా తెలిపారు. తక్కువ సమయంలోనే దీన్ని సాకారం చేశారని తమ బృందానికి కితాబిచ్చారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)