Breaking News

పదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు 

Published on Tue, 01/06/2026 - 04:30

న్యూఢిల్లీ: దేశం వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఉద్యోగాల కల్పనలో వెనుకబడుతున్న నేపథ్యంలో, దీన్ని పరిష్కరించేందుకు పరిశ్రమ దిగ్గజాలు నడుం కట్టారు. వచ్చే పదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలను కల్పించే దిశగా మిషన్‌ హండ్రెడ్‌ మిలియన్‌ జాబ్స్‌ను ఆవిష్కరించారు. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి, నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్, మెకిన్సే మాజీ సీనియర్‌ పార్ట్‌నర్‌ రజత్‌ గుప్తా, ఫ్రాక్టల్‌ సహ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ వెలమకన్ని తదితరులు ఇందులో పాలుపంచుకుంటున్నారు.

ఎంట్రప్రెన్యూర్‌íÙప్‌ను ప్రోత్సహించేందుకు, స్థానిక ఎకానమీలను పటిష్టం చేసేందుకు, భారీ స్థాయిలో కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, పౌర సమాజంతో ఈ మిషన్‌ కలిసి పని చేస్తుంది. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ సహ వ్యవస్థాపకుడు హరీష్‌ మెహతా, ది ఇండస్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ (టై), సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ (సీఐపీపీ) వ్యవస్థాపకుడు కె. యతీష్‌ రజావత్‌ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. 

దేశీయంగా ఉద్యోగం చేసే వయస్సు గల జనాభా సంఖ్య ఏటా 1.2 కోట్ల మేర పెరుగుతుండగా, భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించడంలో ముందుండే తయారీ తదితర రంగాలు ఉపాధి కల్పనలో వెనుకబడుతున్నాయని పేర్కొన్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వారికి ఉపాధి కల్పించేందుకు ఏటా 80–90 లక్షల ఉద్యోగాలను కల్పించాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. 

ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల కల్పనను ఆర్ధికాభివృద్ధికి కీలక కొలమానంగా మార్చడంపై ఈ మిషన్‌ దృష్టి పెడుతుందని తెలిపారు. స్థూల దేశీయోత్పత్తిలో 30 శాతం వాటా ఉండే స్టార్టప్‌లు, చిన్న సంస్థలు అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కలి్పస్తాయని, ఇవి పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, చిన్న ప్రాంతాలకు కూడా విస్తరించేలా ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని మెహతా వివరించారు. ఏటా 80–90 లక్షల ఉద్యోగాలు కల్పించే క్రమంలో అవరోధాలను తొలగిస్తే ఎంట్రప్రెన్యూర్‌íÙప్‌కి, పెద్ద ఎత్తున ఉద్యోగాలను కల్పించేందుకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
 

Videos

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)