Breaking News

రూ.5.82 లక్షల కోట్ల రుణాల మాఫీ

Published on Wed, 08/13/2025 - 10:00

ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5.82 లక్షల కోట్ల మొండి రుణాలను (వసూలు కాని/ఎన్‌పీఏలు) మాఫీ (రద్దు) చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి స్వయంగా రాజ్యసభకు ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.91,260 కోట్లను మాఫీ చేసినట్టు చెప్పారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు.

అత్యధికంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.33 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. 2021–22లో రూ.1.16 లక్షల కోట్లు, 2022–23లో రూ.1.27 లక్షల కోట్ల చొప్పున మాఫీ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇలా మాఫీ చేసిన మొత్తం నుంచి గత ఐదు సంవత్సరాల్లో వసూలైన మొత్తం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం మాఫీ రుణాల్లో వసూలైంది 28 శాతమే. 

ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఎన్‌పీఏలకు బ్యాంక్‌లు ప్రొవిజన్లు చేయాల్సి ఉంటుంది. ఇలా నూరు శాతం కేటాయింపుల తర్వాత నిబంధనల కింద పుస్తకాల్లో మాఫీ చేసినట్టు చూపిస్తాయి. అయినా, వాటి వసూలుకు బ్యాంకులు చర్యలు చేపడుతూనే ఉంటాయి. మాఫీ చేసినప్పటికీ రుణ గ్రహీతలపై చెల్లింపుల బాధ్యత ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు