మిల్లెట్‌ ఫుడ్స్‌కు పీఎల్‌ఐ: కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి 

Published on Wed, 09/06/2023 - 16:05

మిల్లెట్‌ ఆధారిత ఆహార ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమకు కేంద్ర సర్కారు రెండో విడత ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) ప్రకటించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి అనితా ప్రవీణ్‌ తెలిపారు. ఈ పథకం ఆమోదం దశలో ఉందని, దీని కింద రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు కల్పించనున్నట్టు చెప్పారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!)

ఆహారోత్పత్తుల శుద్ధి పరిశ్రమకు మొదటి దశ పీఎల్‌ఐ కింద రూ.800 కోట్లు ప్రకటించగా, గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇది ఆరంభమైనట్టు చెప్పారు. మొదటి దశలో 30 సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పూర్తి స్థాయిలో సబ్‌స్క్రయిబ్‌ అయినట్టు వెల్లడించారు. ఇప్పుడు రెండో విడత కింద మరో రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆహార శుద్ధి యూనిట్లకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రం నుంచి రూ.10,900 కోట్ల నిధులకు ఆమోదం లభించినట్టు చెప్పారు. దీన్నుంచి రూ.800 కోట్లను మొదటి దశ పీఎల్‌ఐ కింద మిల్లెట్‌ ఆధారిత ఉత్పత్తులకు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకం కింద ఆహార శుద్ధి పరిశ్రమలోని చిన్న యూనిట్లకు సాయం చేస్తున్నట్టు అనితా ప్రవీణ్‌ వెల్లడించారు. 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)