Breaking News

ఒక్క కంపెనీ.. 3,200 మంది ‘గేమ్‌’ ఓవర్‌!

Published on Tue, 07/07/2026 - 05:37

మైక్రోసాఫ్ట్‌కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్ (Xbox) తన చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మంది అంటే  3,200 మంది ఉద్యోగులను దశలవారీగా తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో తొలి విడతగా 1,600 మందిని వెంటనే విధుల నుంచి తప్పించగా, మిగిలిన కోతలను 2027 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయనుంది. మైక్రోసాఫ్ట్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఖర్చుల నియంత్రణ, ఏఐ ఆధారిత పెట్టుబడుల పెంపు నేపథ్యంలో ఎక్స్‌బాక్స్‌లో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఉద్యోగులకు పంపిన లేఖలో ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ సంస్థ ప్రస్తుత పరిస్థితిపై స్పష్టంగా స్పందించారు. "ప్రస్తుతం మా వ్యాపారం ఆరోగ్యకరంగా లేదు. ఇతర ప్రముఖ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, పబ్లిషింగ్ సంస్థలతో పోలిస్తే మా లాభ మార్జిన్లు 3 నుంచి 10 రెట్లు తక్కువగా ఉన్నాయి" అని పేర్కొన్నారు. గతంలో చేసిన పలు వ్యూహాత్మక పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడం, గేమింగ్ మార్కెట్లో పెరిగిన పోటీ, హార్డ్‌వేర్ వ్యయాలు పెరగడం సంస్థపై ఒత్తిడి పెంచాయని వివరించారు.

నాలుగు గేమింగ్ స్టూడియోల విభజన

పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎక్స్‌బాక్స్‌కు చెందిన నాలుగు గేమింగ్ స్టూడియోలను కొత్త యాజమాన్యానికి అప్పగించనుంది. అలాగే మరో స్టూడియో భవిష్యత్తుపై కూడా వ్యూహాత్మక సమీక్ష కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ప్రధాన గేమ్ ప్రాజెక్టులను రద్దు చేసే ఉద్దేశం లేదని సంస్థ స్పష్టం చేసింది.

నిర్వహణ వ్యవస్థలో భారీ మార్పులు

సంస్థలో కొన్ని విభాగాల్లో 14 స్థాయిల మేనేజ్‌మెంట్ ఉండటంతో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని ఆశా శర్మ పేర్కొన్నారు. అందుకే ఇకపై మేనేజ్‌మెంట్ పొరలను గరిష్ఠంగా ఐదు స్థాయిలకే పరిమితం చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే బాహ్య విక్రేతలపై (Vendor) వ్యయాన్ని 50 శాతం వరకు తగ్గించే నిర్ణయం తీసుకున్నారు.

కొత్త సీఓఓగా హెలెన్ చియాంగ్

ఎక్స్‌బాక్స్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు హెలెన్ చియాంగ్‌ను కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమించారు. కంటెంట్, హార్డ్‌వేర్, ప్లాట్‌ఫారమ్, సేవలపై సమగ్ర బాధ్యత ఆమెకు ఉంటుంది. మొజాంగ్ (Minecraft), కింగ్ (Candy Crush) వంటి ప్రధాన స్టూడియోలు కూడా ఇకపై నేరుగా సీఈఓ పరిధిలోకి రానున్నాయి.

ఉద్యోగుల తొలగింపులు బాధాకరమైనవేనని, అయితే అవి ఉద్యోగుల ప్రతిభను ప్రతిబింబించవని ఆశా శర్మ స్పష్టం చేశారు. "ఎక్స్‌బాక్స్‌ను మరింత దృఢమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికీ పెట్టుబడులు కొనసాగుతాయి. అయితే ఇకపై మరింత క్రమశిక్షణతో, స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తాం" అని ఆమె పేర్కొన్నారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)